37.2 C
Hyderabad
May 2, 2024 12: 09 PM
Slider శ్రీకాకుళం

ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దుచేయాలి

#employementgatentee

శ్రీకాకుళం నగర కార్పోరేషన్ లో విలీనమైన 7 గ్రామ పంచాయితీలలో ఉపాధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్  నెంబరు 17000 (31)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రెండు పూటల పని విదానం రద్దు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని, మంచినీళ్లకు, మజ్జిగకు, పని ముట్లు పదును పెట్టుకోవడానికి అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 రోజులు పని చేసిన ప్రతీ కుటుంబానికి పనిముట్లు, టెంటు ఇవ్వాలని, బకాయిలు చెల్లించేటప్పుడు వడ్డీతో సహ కలిపి ఇవ్వాలని కోరారు. అదే విధంగా పే స్లిప్పులు ఇవ్వాలని, కుటుంబానికి 200 రోజుల పని హక్కు కల్పించాలని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, పదకం అమలులో అవినీతి అరికట్టాలని కోరారు.

పట్టణాలలో కూడా ఉపాధి హామీ పధకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్నిడిమండ్ చేసారు. వ్యవసాయ కార్మిక సంఘం రాస్ట్ర ఉపాద్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, జిల్లాకార్యదర్శి గంగరాపు సింహాచలం మాట్లడుతూ నగర కార్ఫోరేషన్ లో విలీనం చేసిన పెద్దపాడు, పాత్రోనివలస, చాపురం ,కాజీపేట ,కిల్లిపాలేం ,కుశాలపురం , తోటపాలేంగ్రామ పంచాయితీలలో నిలుపుదల చేసిన పనులు పునరుద్ధరించాలని వారు కో‌రారు.

దర్నాఅనంతరం జిల్లా కలక్ట ర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్ కి డిమాండ్సు తో కూడిన వినతిపత్రం అందజేసినట్లుతెలిపారు. ఈవిషయం పై కలక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బగది నాని, సీపాన రాజు, గొర్లి రమణ, సీపాన సావియ్తమ్మ, జమ్మ లరాజు, గొర్లి శాంతి, సీర యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ పాక్షిక సడలింపు

Satyam NEWS

టిబి వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ట్రాఫిక్ సిబ్బందితో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం

Satyam NEWS

Leave a Comment