26.7 C
Hyderabad
May 3, 2024 09: 57 AM
Slider నిజామాబాద్

సోషల్ సర్వీస్: కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

social service

స్పర్శ కార్యక్రమంలో భాగంగా ” చేయి చేయి కలుపుదాం కుష్టు వ్యాధి నివారిందా౦” అనే వినాదంతో ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేస్తూ కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. కుష్టు వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేజీబీవీ పాఠశాలలో డి పి ఎం ఓ లక్ష్మీనారాయణ, ఆరోగ్య బోధకులు దస్తీరాం విద్యార్థులకు అవగాహన కల్పించారు.

చర్మంపై స్పర్శలేని మచ్చలు, కనుబొమ్మల కనురెప్పలు వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, కాళ్ళ నుంచి చెప్పులు జారి పోవడం, కాళ్లు చేతులు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం తదితర లక్షణాలు కనిపించినట్లయితే మీ దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తను లేదా ప్రభుత్వ వైద్యులను సంప్రదించి నివారణ నిమిత్తం ఎమ్ డి టి మందులను ఉచితంగా పొంది వాడాలి అన్నారు. ఈ మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఉచితంగా అందచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

జ‌ర్న‌లిస్టుపై సామ తిరుమ‌ల‌రెడ్డి అనుచ‌రుల దాడి!

Sub Editor

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

కరోనా రోగుల్ని దోచుకున్న డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు

Satyam NEWS

Leave a Comment