31.7 C
Hyderabad
May 2, 2024 10: 38 AM
Slider నల్గొండ

ఆందోళన చేస్తున్న రైతుల మద్దతుకు బైక్ ర్యాలీ

#SolidarityRally

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన కార్మిక చట్టాల సవరణను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజ డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU కార్యాలయంలో ఆదివారం భవన నిర్మాణ రూరల్, మండలం రెండో మహాసభ గోవింద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, వ్యవసాయ మూడు చట్టాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

బిజెపి ప్రభుత్వం తప్పుడ రైతుల గురించి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని, తక్షణమే ప్రభుత్వం నిజాయితీగా రైతుల త్యాగాలను గుర్తించి చర్చలకు ఆహ్వానించి చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

భవన నిర్మాణ కార్మికులుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, కార్మికులకు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో  బిల్డింగ్ కార్మికులకు నెలకి 7,500 చొప్పున  పది నెలలు ఇవ్వాలని అన్నారు.

అనంతరం హుజూర్ నగర్ పట్టణంలో ఢిల్లీలో రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే రైతుల సమస్యలను ఆలోచించి కేంద్రం తన మొండి వైఖరి విడనాడాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని, కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలని కోరారు.

భవన నిర్మాణ కార్మికుల రెండో మహాసభ సందర్భంగా పాల్గొన్న కార్మికులు ఢిల్లీ రైతులకు సంఘీభావంగా తమ వంతుగా 2,250 రూపాయలు విరాళం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు రావుల పెంట వెంకయ్య, ఎలక సోమయ్యగౌడ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం సి ఐ టి యు పోరాటం చేస్తుందని అన్నారు.

ఆదివారం ఎన్నికైన నూతన కమిటీ సభ్యులుగా గౌరవ అధ్యక్షుడు శీతల రోషపతి, అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు అన్నం రామిరెడ్డి, షేక్ జానీ, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా  కోశాధికారి శీలం వేణు,

సల్మాన్, నాగుల్ మీరా, రాంబాబు, శాంతయ్య, సైదులు, మల్లేష్, వెంకట నర్సయ్య,రాజేష్ ,సురేష్, వెంకన్న తో పాటుగా  ఇరవై ఒక్క మంది సభ్యులతో నూతన కమిటీ ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ నాగుల్ మీరా,గంట వెంకన్న, సతీష్,సురేష్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర శర్మ

Related posts

వసంత పంచమికి టీఎస్‌ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

సి ఎం ఆర్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Satyam NEWS

పేద బ్రాహ్మాణ కుటుంబాలకు బియ్యం పంపిణీ

Satyam NEWS

Leave a Comment