26.7 C
Hyderabad
May 3, 2024 10: 25 AM
Slider మహబూబ్ నగర్

లక్కీ డ్రా స్కీమ్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు: కొల్లాపూర్ సీఐ యాలాద్రి

#kollapurCI

అమాయక ప్రజలకు ఆకర్షణీయమైన బహుమతులు ఆశ చూపి ఎవరైనా డబ్బులు దండుకోవాలని చూస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి.యలాద్రి హెచ్చరిస్తున్నారు. లక్కీ డ్రా స్కీమ్ లను ఎవరూ ప్రోత్సహించవద్దని, లక్కీ డ్రా స్కీమ్ లు  నిషేధమని ప్రజలకు తెలిపారు. గిఫ్ట్ ల కోసం అశపడితే మొదటికే నష్టపోతారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ స్కీములు ఎవరు నిర్వహించినా లేదా అటువంటి వాటికి సహకరించినా కూడా  వారిపై కేసులు రిజిష్టర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ యాలాద్రి హెచ్చరించారు.

ప్రజలకు సూచన

కొల్లాపూర్ సర్కిల్ పరిథిలో లక్కీ డ్రా స్కీములు ఎవరు ఎంకరేజ్ చేయవద్దని, వాటిని నమ్మవద్దని ప్రజలకు కొల్లాపూర్ సిఐ యాలాద్రి సూచనలు చేస్తున్నారు. లక్కి డ్రా స్కీమ్ లు నిర్వహిస్తే  తమ దృష్టికి తీసుకురావాలని అంటున్నారు. లక్కీ డ్రా స్కీమ్ ల  వలన ఆర్థికంగా నష్టపోతారని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా  లక్కీ డ్రా స్కీమ్ లో డబ్బులు కట్టి నష్ట పోతున్నారని తెలియజేశారు. వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొల్లాపూర్ లో కొందరు  స్కీమ్ లు నడుపుతున్నారని ప్రజలు అంటున్నారు. చిన్నంబావి మండలంలో కూడా లక్కీ డ్రా స్కీములు కొందరు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ .. వెల్లడించిన టెర్రరిస్ట్..

Sub Editor

జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి

Satyam NEWS

Leave a Comment