27.7 C
Hyderabad
April 30, 2024 10: 46 AM
Slider నెల్లూరు

త్వరలో 41వ డివిజన్ కు మరో రూ. 70 లక్షలు

#Adala Prabhakar Reddy

41 వ డివిజన్ కు త్వరలో మరో 70 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామని నెల్లూరు , రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 41వ డివిజన్లోని మనుమసిద్ధి నగర్ సాయి సంజీవని అపార్ట్మెంట్ సమీపంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 41వ డివిజన్ ప్రాంతం కొత్తగా ఏర్పడినదని, అందువల్ల ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ లేఅవుట్లు వేసిన వారు సౌకర్యాల గురించి పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ప్రాంతానికి రోడ్లు వేయాలని నుడా వైస్ చైర్మన్, కార్పొరేషన్ కమిషనర్ లను కూడా కోరానని తెలిపారు.

స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, స్థానిక నేతలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తున్నారని, ఆ ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రానున్న రోజుల్లో నెల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని సుఖ సంతోషాలతో ఉండేలా కృషి చేద్దామని తెలిపారు. ఈ సందర్భంగా బాగా పనిచేసిన వాలంటీర్లకు అభినందన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, బాబ్జి, సుతారాం సురేష్, వీరాచారి పాల్గొన్నారు.

కార్పొరేటర్లు అవినాష్, బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, హరిబాబు యాదవ్, శరత్ చంద్ర, అల్లాబక్షు, వైసీపీ సేవాదళ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

25న హుజూర్ నగర్ లో జరిగే కార్మిక,కర్షక పోరు యాత్ర జయప్రదం చేయండి

Satyam NEWS

పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు: మంత్రి  హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment