38.2 C
Hyderabad
May 3, 2024 19: 48 PM
Slider నల్గొండ

25న హుజూర్ నగర్ లో జరిగే కార్మిక,కర్షక పోరు యాత్ర జయప్రదం చేయండి

#Roshapati

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతులు 60 రోజుల నుండి గడ్డకట్టే చలిలో పోరాటం చేస్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యాపేట జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి సంఘీభావంగా ఈనెల 24, 25, 26న, సూర్యాపేట జిల్లాలో జరిగే కార్మిక కర్షక పోరు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మేళ్లచెరువు మండలం రామాపురం ప్రియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ప్రధాని మోడీ ప్రవర్తన ఉందని అన్నారు.

25న హుజూర్ నగర్ ఉదయం10 గంటలకు, మేళ్ళచెరువు మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే జీపు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు తీగల శ్రీను, ఎస్కే అజరుద్దీన్, అంకారావు లక్ష్మయ్య, ప్రకాష్, సైదయ్య, సురేష్, రాజశేఖర్, శౌరీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ: కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌

Satyam NEWS

చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

ముంచుకొస్తున్న పెద్ద ముప్పు

Sub Editor

Leave a Comment