Slider ప్రపంచం

శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం..

ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో కూడా కొన్ని శతాబ్దాలుగా కుక్కమాసం తినే సాంప్రదాయం ఉంది. అయితే తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇక నుంచి తమ దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేధిస్తున్నామని అధికార కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.

దక్షిణ కొరియాలో సుమారు 1 మిలియన్‌ కుక్కలు తింటారని అంచనా. అయితే ఇప్పటి తరాలు ఆ సంస్కృతి వ్యతిరేకిస్తున్నాయి. కుక్కలను పెట్ డాగ్‌లుగా పెంచుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే కుక్కమాసం నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేధించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేధాన్ని సమర్థించారు. ఈ నిర్ణయాన్ని డాగ్ ఫార్మింగ్ ఇండస్ట్రీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో కనీసం 3000 కుక్కల ఫామ్‌లు ఉన్నాయి. ఈ పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దీంతో కుక్క మాంసంపై నిర్ణయాన్ని పౌరుల వ్యక్తిగతానికి వదిలిపెట్టాలని, పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయం కాదని వీరంతా డిమాండ్ చేస్తున్నారు.

Related posts

గుంతల రోడ్ల రిపేరుకు చర్యలు

Satyam NEWS

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS

మనల్ని వదిలి వెళ్లిపోయిన జర్నలిస్టు సురేష్

Satyam NEWS

Leave a Comment