33.7 C
Hyderabad
April 30, 2024 01: 59 AM
Slider ఆధ్యాత్మికం

చక్రస్నానం,ధ్వజారోహణం తో ముగిసిన  శ్రీ  సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

#sowmyanathaswamy

అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మకంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవ గౌరవ అధ్యక్షుడు, మేడా విజయ భాస్కర్‌ రెడ్డి,సమనవ్య కర్త మేడా విజయ శేఖర్‌ రెడ్డి ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

ముందుగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి గ్రామోత్సవం, వసంతోత్సవాల నడుమ జరిగింది. అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులకు సుగంధ పరిమళ గంధం, పాలు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలములతో అభిషేకం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆగమశాస్త్ర పండితులు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం భక్తులు కోనేటిలో స్నానం ఆచరించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాగా సాయంత్రం ధ్వజా అవరోహణం క్రమంతో శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

Related posts

హెల్పింగ్ హ్యాండ్: కొనసాగుతున్న సహాయక చర్యలు

Satyam NEWS

కానుక తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

రెడ్ కార్నర్: నల్లమల అడవిని కొల్లగొడుతున్న క్వార్జ్ దొంగలు

Satyam NEWS

Leave a Comment