38.2 C
Hyderabad
April 29, 2024 13: 26 PM
Slider మహబూబ్ నగర్

పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి: దళిత బహుజన ప్రoట్

#mukkidigundam

తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని దళిత బహుజన ఫ్రంట్ ,తెలంగాణ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు పి. శంకర్, జంగన్న లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం గ్రామంలో వారు పర్యటించారు. సంవత్సరాల తరబడి భూములు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులను వారు తీవ్రంగా ఖండించారు.

గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పి రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకున్నా కూడా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం, గిరిజనులపై దాడులు చేయడం ముమ్మాటికి రాజ్య హింస అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12 లక్షల గిరిజనులు పట్టా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

తెలంగాణ తెచ్చుకుంది హక్కుల కోసమే కదా! మరి దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అడవి పై ఆధారపడి నివసిస్తున్న గిరిజనులకు హక్కులను పరిరక్షించాల్సింది పోయి అటవీశాఖ అధికారులు వారిపై దాడులకు దిగడం మానవ హక్కుల ఉల్లంఘన అని అన్నారు.

కొల్లాపూర్ నల్లమల్ల అడవుల నుండి మంచిర్యాల, ఆదిలాబాద్ వరకు పోడు భూముల కలిగిన గిరిజనుల దగ్గరికి తానే స్వయంగా వెళ్లి కూర్చేసుకుని పట్టాలిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు దాడులు చేయించడం గిరిజన హక్కులను కాలరాయడమే అని అన్నారు. బాలింతలు, గర్భిణులు, చంటి పిల్లలను సైతం వదలడం లేదని ఆయన అన్నారు. భూమిని నమ్ముకొని జీవిస్తున్న నిరుపేదల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం భూములు కాజేస్తున్న రియల్ ఎస్టేట్ పంచన చేరిందని దుయ్యబట్టారు.

ముక్కుడి గుండం గ్రామంలో ఇటీవల ఫారెస్ట్ అధికారుల దాడులకు మందు తాగి అనారోగ్యానికి గురైన చంద్రు దేవి ,తారాసింగ్ కుటుంబాలను పరామర్శించారు. సదరు గ్రామంలో సెంటు భూమిలేని నిరుపేదలు పట్టణాలకు వలస వెళ్లారని, వారికి సైతం ప్రభుత్వం గుర్తించి ఇప్పటివరకు పెట్టిన వివిధ కేసులను తొలగించి పోడు భూముల పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం చేస్తామని పట్టాలు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఈ పర్యటన వివరాలను రాష్ట్ర గవర్నర్ కి, చీఫ్ సెక్రటరీకి, ఆయా శాఖల మంత్రులకు నివేదించి న్యాయం జరిగేదాకా పోరాడుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మనవహక్కుల వేదిక నాయకులు రోహిత్, జంగన్న, దళిత బహుజన ఫ్రంట్ నాయకురాలు కల్పన, తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు మీసాల రాము, దళిత దండు రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు, మాదాసి కురువ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్ద మల్లయ్య, వెల్టూరు గుందిమల్ల సాధన సమితి నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్,పెరుమాళ్ళ తిరుపతి, తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి మంతటి గోపి, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు కేశంపేట రాములు, ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, ఆకునముని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల తిరుపతి దేవస్థానం జీతాలు ఇచ్చే స్థితిలో లేదా?

Satyam NEWS

సమ సమాజ స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసిన జగజ్జీవన్ రామ్

Satyam NEWS

డబుల్ ధమాకా: వైసిపికి చెంప దెబ్బ టిడిపికి గోడ దెబ్బ

Satyam NEWS

Leave a Comment