32.7 C
Hyderabad
April 27, 2024 02: 05 AM
Slider కరీంనగర్

డోంట్ బిలీవ్:నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ ని నమ్మి మోసపోవద్దు

sp rahul hegde warned people dont belive fake gulf agents

గల్ఫ్ నకిలీ ఎజెంట్స్ ని నమ్మి మోసపోవద్దని ఎడారి దేశాలకి వెళ్ళడానికి గుర్తింపు పొందిన గల్ఫ్ ఏజెంట్స్ ని ఆశ్రయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ముస్ధాబాద్ మండలం అవునూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు.ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీప్రజల భద్రత రక్షణ కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాం అని అన్నారు.

అనంతరం కూడలిలో ప్రజలకి చట్టాల పై అవగాహన కల్పించారు.కాలనీ లోకి వచ్చిన నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి సమాచారం పోలీస్ లకు అందించాలని ఆయన సూచించారు. నేరాల నిర్మూలనకోసం ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహింస్తున్నామని, దీని వలననేరాలు అదుపులో ఉంటాయని , ఎవ్వరు కూడా ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని , కొత్త వ్యక్తులకుఇంటిని కిరాయికీ

ఇచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే వారి ఆధార్‌కార్డు చూడాలి , కొత్త వ్యక్తులు గ్రామంలో తిరిగినట్లయితే ముందుగా అట్టి సమాచారం తెలిసినవారు దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలి. ప్రతిఒక్కరు వాహనాల పత్రాలు తమవద్ద ఉంచుకోవాలని , ఇతరులకు తమ వాహనాలను ఇవ్వవద్దని, ఇతరులు తమ వాహానాలను తీసుకొని వెళ్ళినేరాలు చేస్తారని, అట్టినేరం ఆ వాహానయాజమానిపై కేసులు నమోదుచేయడం జరుగుతుందని అన్నారు. కావున ప్రజలు ఎవ్వరు కూడా వాహనాలను ఇతరులకు

ఇవ్వవద్దనితెలియజేశారు. ప్రస్తుతం పోలీస్ ఆదీనంలో గల వాహనాల పేపర్లు తీసుకొనివచ్చి అట్టివాహానాలను తీసుకొని వెళ్లలని అన్నారు. వాహనాల పత్రాలు లేని వారి పై మోటారు వాహనచట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని , పోలీసవారికి పూర్తిగా సహకరించడం జరిగింది.గల్ఫ్ నకిలీ ఎజెంట్స్ ని నమ్మి మోసపోవద్దని ఎడారి దేశాలకి వెళ్ళడానికి గుర్తింపు పొందిన గల్ఫ్ ఏజెంట్స్ ని ఆశ్రయించాలని సూచించారు. సి సి కెమెరాలా ఏర్పాటుతో నేరాలు దొంగతనాలు అరికట్టవచని కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పారు.

వాహనదారులు డ్రైవింగ్ భీమా ఆర్.సి పొల్యూసన్ తదితర ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండటంతో ప్రమాదాలు జరిగిన సమయం లో లబ్ధి చేకూరుతుందని సూచించారు.ఎలాంటి సమస్య వచ్చినా డయల్-100 కి కాల్ చేయాలని చేసిన నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్ లేదా పెట్రోకార్ మీ ముందు ఉంటుందని చెప్పారు.నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని అయన కోరారు.అవునూరు గ్రామంలో లో పోలీసులు మంగళవారం సాయంత్రం చేపట్టిన కార్డెన్ సర్చ్ తనిఖీల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

పోలీస్ లు సాయంత్రం సమయంలో గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇల్లును తనిఖీ చేశారు.కుటుంబ సభ్యుల వివరాలు వాహనాల ధ్రువుకరణ పత్రాలు పరిశీలించారు.సరిగా ధ్రువీకరణ పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు 04 ఆటోలు,ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో సిరిసిల్ల టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్ గారు, రురల్ సి.ఐ సర్వర్ గారు, ఎస్.ఐ లు ప్రవీణ్ కుమార్ ,అభిలాష్ ,లక్ష్మారెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

ఎవరు వీరు ?

Satyam NEWS

కరోనా హాస్పిటల్:వెయ్యిపడకలు ఆరు రోజుల్లో నిర్మాణం

Satyam NEWS

కేజీబీవీలో మెరిసిన ఆణిముత్యాలు: సత్తాచాటిన అనాధ బాలికలు

Satyam NEWS

Leave a Comment