40.2 C
Hyderabad
April 29, 2024 17: 39 PM
Slider విజయనగరం

విజయనగరం పోలీసు శాఖ స్పందన కు 26 ఫిర్యాదులు

#spandana

రాష్ట్ర ప్రభుత్వం లో అటు రెవిన్యూ శాఖ ఇటు పోలీసు శాఖ ఒకేరోజు రాష్ట్ర ప్రజల సమస్యలు వాటి పరిష్కారానికై ప్రతీ సోమవారం ఆయా పరిధుల్లో ” స్పందన” నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా నే విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందనకు దాదాపు వందకు పైగా బాధితులు తమ‌, తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో తెలిపితే పోలీసు శాఖ నిర్వహించిన “స్పందన”కు 26 ఫిర్యాదు దారులు మాత్రమే పోలీసు కార్యాలయానికి వచ్చి.. తమ గోడు, బాధలను చెప్పుకున్నారు.

దీంతో  పోలీసు బాస్…వీడియో కాన్ఫరెన్స్ ద్వారా… సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదు దారుల ముందే మాట్లాడి..సిబ్బంది పనితీరు ప్రత్యక్షంగా చూసి..అక్కడికక్కడే సమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు.

సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ… 26 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

బొండపల్లి మండలం ముద్దూరు గ్రామానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్తకు మద్యం ఇచ్చి, ఆస్తిని కాజేయాలనే ఉద్దేశ్యంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా బెదిరింపులకు పాల్పడుతూ, మా కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.

కొత్తవలసకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటికి దగ్గరలో ఉన్న కొంతమంది వ్యక్తులు నిష్కారణంగా తనతో తరుచూ గొడవలు పడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస ఇన్స్పెక్టరును ఆదేశించారు.

విజయనగరం పట్టణంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన తమ్ముడు, అతని స్నేహితులకు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పిస్తానని తెలంగాణకు రాష్ట్రం అదిలాబాద్ కు చెందిన ఒక వ్యక్తి మోసగించి, సుమారు  10 లక్షలు తీసుకున్నారని, ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, ఎటువంటి ఉద్యోగాలు కల్పించలేదని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని విజయనగరం 1వ పట్టణ సిఐను ఆదేశించారు. విశాఖపట్నంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన కొంతమంది వ్యక్తులు తాను కొత్తవలసలో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ను ఆక్రమించేందుకు తనను మరియు ఇతర ఫ్లాట్ యజమానులను బెదిరిస్తూ, దౌర్జన్యంకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, నిందితులను గుర్తించి, వారిని బైండోవరు చేయాలని కొత్తవలస ఇన్స్పెక్టరును ఆదేశించారు.

మెరకముడిదాం మండలం గాతాడ  కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన భర్తను కలవకుండా ఇతర కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన భర్త ఆచూకీ తెలిసేంత వరకు తనను వారింటిలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ..ఇరుకుటుంబ సభ్యులను పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించాలని, సమస్య పరిష్కారం కాకుంటే వారిపై కేసు నమోదు చేసి, ఫిర్యాదికి న్యాయం చేయాలని చీపురుపల్లి సిఐను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను కార్పెంటరు పనులు చేసుకొంటుండగా, ఒక వ్యక్తి వచ్చి తనకు భారత బ్యాంకులో లోను ఇప్పిస్తానని, అందుకు 20వేలు ఖర్చు అవుతుందని, కాగితాలు తీసుకొని విజయనగరం రమ్మనమని చెప్పగా, అతని మాటలు నమ్మి,తన భార్య చెవి దిద్దులు అమ్మి, లోను మంజూరు చేసేందుకుగాను 15 వేలు ఇచ్చానని, తాను సదరు వ్యక్తికి ఫోను చేస్తుంటే స్పందించడం లేదని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం 1వ పట్టణ సిఐను ఆదేశించారు. ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదు దారులసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ సిహెచ్. రుద్రశేఖర్, డిసిఆర్జి ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి, ఆర్ఎస్ఐ నీలిమ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రగతి భవన్ ను ముట్టడించిన ఓయూ జేఏసీ

Satyam NEWS

పెరిగిన ధరలు తగ్గించే వరకు పోరాటం

Murali Krishna

సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన

Satyam NEWS

Leave a Comment