23.7 C
Hyderabad
May 8, 2024 03: 55 AM
Slider విజయనగరం

“స్పందన” ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి….!

ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ప్ర‌తీ సోమ‌వారం ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వ‌హించే “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక‌ నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, అక్క‌డిక్క‌డే బాధితుల ముందే ఫోన్ లో మాట్లాడారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 34 ఫిర్యాదు లను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం, వి.టి. అగ్రహారంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తను ఒకామె వద్ద నెల, నెలా చీటీ డబ్బులు కట్టినట్లు, చీటీ కాలం పూర్తిఅయిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా తన డబ్బులు ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇప్పించి తనకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ఎ స్ఐని ఆదేశించారు.

విజయనగరం, గాజులరేగకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు చెందిన స్థలంను వేరొక వ్యక్తికి కొంతకాలం ఉండేందుకు ఇచ్చినట్లు, ప్రస్తుతం సదరు వ్యక్తి తన స్థలాన్ని ఖాళీ చేయడంలేదని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐని ఆదేశించారు

సంతకవిటి మండలం, మందరాడకి కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానిక ఒక వ్యక్తి తనను ప్రేమించి పెళ్ళి చేసుకొంటానని చెప్పి, పెళ్ళికి నిరాకరించి మోసం చేస్తున్నట్లు, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని ఫిర్యాదికి న్యాయం చేయాలని సంతకవిటి ఎస్ఐని ఆదేశించారు.

తెర్లాం మండలం, చీకటిపేటకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తనకు నాలుగేళ్ల‌ క్రితం వివాహం జరిగింద‌ని, తను, తన భార్య కుటుంబ తగాదాల వలన కొంత కాలంగా వేరుగా ఉంటున్నట్లు, తన భార్య ఎన్నిసార్లు పిలిచినా కాపురానికి రావడంలేదని, తన కుమారున్ని తనకు చూపించడంలేదని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి రూరల్ సీఐని అదేశించారు.

విజయనగరం, కంటోన్మెంట్ కు చెందిన ఒకామె జిల్లా ఎస్ప్ఈకి ఫిర్యాదుచేస్తూ తనకు కంటోన్మెంట్ నందు వారసత్వంగా వచ్చిన ఖాళీ ఇంటి స్థలం ఉన్నట్లు సదరు స్థలంకు రెండువైపులా స్థలం ఉన్న వ్యక్తులు తన స్థలంను ఆక్రమించుకొని, తనను ఇల్లు నిర్మించకుండా అడ్డుకొంటున్నట్లు, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వ‌న్ టౌన్ సీఐని ఆదేశించారు.

ఇలా స్వీకరించిన 34 ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజ‌ల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ
శ్రీమతి ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఎస్బీ సీఐ సి.హెచ్. రుద్రశేఖర్, ఎస్ఐలు వాసుదేవ్, ముకుందరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మంగళగిరి కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

Satyam NEWS

సిబిఐటి లో పరీక్షా పే చర్చ 2023

Satyam NEWS

రేషన్ కార్డు లేని వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment