30.7 C
Hyderabad
April 29, 2024 03: 37 AM
Slider విజయనగరం

బంగారం కోసం ఘాతుకం…! బంధువే హంతకుడు…!

#police

విజయనగరం జిల్లాలో కొత్తవలస మరోసారి వార్తలకెక్కింది. అదీ ఓ హత్య కేసు ఘటనకు సంబంధించి. వివరాల్లోకి వెళితే.. జిల్లా లోని కొత్తవలస మండలం చింతలదిమ్మ  లో జరిగిన లాభాపేక్ష హత్య కేసును ఛేదించి, నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుండి దోచుకున్న బంగారం 34.495 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేశారు…. కొత్త వలస పోలీసులు. ఈ మేరకు చేసినట్లుగా  జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక వివరాలను వెల్లడించారు.

ఎల్.కోట మండలం జమ్మాదేవిపేట కు చెందిన నిందితుడు మాదాబత్తుల అలియాస్ మాదాబత్తుని కృష్ణ  ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు తన దగ్గరి బంధువు  ఇంటికే కన్నం వేయాలని చూసాడు. ఇందులో భాగంగా కొత్తవలస కుమ్మరివీధికి  చేరుకొని, అతనిని ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని, తలకు టోపి పెట్టుకొని అతని పెద్దమ్మ అయిన మాదాబత్తుల సూర్యకాంతం ఇంటిలోకి చొరబడ్డాడు.

ఇంటిలో ఇతర కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోవడంతో సూర్యకాంతం మెడలోగల రెండు పేటల బంగారు పుస్తుల త్రాడును త్రెంపేందుకు ప్రయత్నించగా, సూర్యకాంతం అతడిని ప్రతిఘటించి, అతని ముఖానికి ఉన్న ఫ్ను తొలగించి, అతడి వారి బంధువు దాబత్తుల కృష్ణ గా గుర్తించింది. అతడిని ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నావని, అతడితో పెనుగులాటలు ఆడుతుండగా, నిందితుడు కృష్ణ ఆమెను వంట ఇంటిలోగల కత్తిపీటతో ఆమె తలపైన విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది.

సంఘటనా స్థలంలో ఆనవాళ్ళు లేకుండాను, పోలీసు జాగిలాలు నిందితుడి ఆచూకీని గుర్తించకుండా ఉండేందుకుగాను వంటగదిలోని కారం తీసి, సంఘటనా స్థలంలో జల్లి, రక్తపు మడుగులో పడిపోయిన సూర్యకాంతం మెడలోని పుస్తుల త్రాడు, ఒక చెవికిగల ఎత్తు గొలుసును నిందితుడు మాదాబత్తుల కృష్ణ తీసుకొని అక్కడ నుండి పరారయ్యాడు. అనంతరం, సదరు నగలను విశాఖపట్నం గోపాలపట్నంలోని అటికా గోల్డ్ లోను సంస్థలో తన ఆధార్ కార్డును గుర్తింపుగా ఇచ్చి, దోచుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టగా, అతని బ్యాంకు అకౌంటు  1.48 లక్షలు జమయ్యాయన్నారు.

అనంతరం, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను, పిల్లలకు బట్టలను కొనుగోలు చేసేందుకు కొంత నగదును ఖర్చు చేసాడు. అనంతరం, నిందితుడు తన భార్య పిల్లలతో అత్తవారింటికి వెళ్ళి, అక్కడ నుండి విజయవాడ వెళ్ళి, తల నీలాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకొని, కూలీ పనుల నిమిత్తం కర్నాటక రాష్ట్రం కొప్పల్ కు వెళ్ళిపోయాడు.

నిందితుడు భార్య ఫోను చేసి, మాదాబత్తుల సూర్యకాంతం చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేరి, చనిపోయినట్లు, తన పిల్లలకు కూడా ఆరోగ్యం బాగులేదని, రమ్మనమని కోరగా, ఎల్.కోట మండలం జమ్మాదేవీపేట రాగా, పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, కొత్తవలస సిఐ ఎస్.బాలసూర్యారావు, సిసిఎస్ సిఐ ఎం. బుచ్చిరాజు సాంకేతిక ఆధారాలను సేకరించి, లాభాపేక్ష హత్యకు పాల్పడిన నిందితడిగా మాదాబత్తుల కృష్ణను గుర్తించి, అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిఐలు ఎన్.బాలసూర్యారావు, ఎం. బుచ్చిరాజు, ఎలువై.వి.జనార్ధన్, హేమంత్ కుమార్, సాగర్ బా బు, సిసిఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.ఎస్పీ తో పాటు విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, కొత్తవలస సిఐ ఎస్. బాలసూర్యారావు, ఎస్బీ సిఐ జి.రాంబాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గుడ్ న్యూస్ : ఉల్లి ధరలు త్వరలో తగ్గబోతున్నాయి

Satyam NEWS

చంద్రబాబునాయుడి పై అట్రాసిటీస్ కేసు పెడతాం

Satyam NEWS

ప్రతి ఏడాది పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Murali Krishna

Leave a Comment