38.2 C
Hyderabad
May 1, 2024 19: 53 PM
Slider విజయనగరం

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

#vijayanagarampolice

తమ బాధలు..సమస్యలను పోలీసమ్మకు చెప్పుకుంటే ఇట్టే పరిష్కారం చూపెడతారన్న గంపెడంత ఆశతో ప్రతీ వారం విజయనగరం జిల్లాలో జరుగుతున్న “స్పందనకు” బాధితులు తమ తమ ఫిర్యాదులను ముఖస్థంగా విన్నవించుకుంటు న్నారు. ఆ నమ్మకం తో వారంవారానికి బాధితుల సంఖ పెరిగి..ఈ వారం 35 మంది ఎస్పీ దీపికా ముందు తమ బాధను వెళ్లగక్కారు.

ఈ మేరకు  జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక, “స్పందన” కార్యక్రమాన్ని  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ  దీపికా ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. బాధితులు.. వారి సమస్యల వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన భార్యకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కల్పిస్తానని సతివాడ కి చెందిన వ్యక్తి మభ్య పెట్టి, తమ వద్ద నుండి  3 లక్షలు తీసుకొని, మోసం చేసారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్తపై దిశ పోలీసు స్టేషను లో ఫిర్యాదు చేసిన కారణంగా కేసు నమోదు కావడంతో, తన భర్త బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ సీఐను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

విజయనగరంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తాను పీడబ్ల్యూ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నట్లు, వ్యాపారానికి కావాల్సిన వస్తువులను తన సోదరుల వద్ద నుండి కొనుగోలు చేసి, ఇటీవల వేరే వ్యక్తి వద్ద వస్తువులను కొనుగోలు చేయడంతో, తనను వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

కొత్తవలసకు చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తనకు కొత్తవలస పట్టణంలో 15 సం.లు క్రితం కొనుగోలు చేసిన ఇంటిని పడగొట్టి, క్రొత్తగా కట్టేందుకు ప్రయత్నించగా, కొంతమంది వ్యక్తులు సదరు ఇల్లు తమదని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సీఐను ఆదేశించారు.

విజయనగరం మండలం జమ్ము కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించేందుకుగాను అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఇంటి పనులు పూర్తిగా చేసిన తరువాతనే వారు తనకు డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో, తాను నిర్మాణ పనులు చేయడం ఆపేసానని, తాను చేసిన పనులకు ఇవ్వవలసిన డబ్బులను ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

డెంకాడ మండలం పెదతాడివాడ కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన వ్యక్తికి గరుడబిల్లి లో 3-16 ఎకరాల స్థలంను విక్రయించగా, తనకు ఇంకనూ ఇవ్వవలసిన 3 లక్షలు చెల్లించకుండా, మరో 1-70 ఎకరాల స్థలంను ఆక్రమించి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 రోజుల లో సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది ని ఆదేశించారు.

తీసుకున్న ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డిసిఆర్బి సీఐ డా.బి. వెంకటరావు, ఎస్ఐలు వాసుదేవ్, లోకేశ్వరరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ఢిల్లీ మద్యం కుంభకోణం పూర్తి వివరాలు ఇవి

Satyam NEWS

DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులె వర్ధంతి

Satyam NEWS

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు జర్నలిస్టు భగీరథ ఎంపిక

Satyam NEWS

Leave a Comment