40.2 C
Hyderabad
May 2, 2024 15: 10 PM
Slider సినిమా

ప్రవాస భారతీయుడు సమీర్ పెనకలపాటి భక్తి పూర్వక సమర్పణ అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్

ayodhyaram

ఆది పురుషుడు అయోధ్య రామయ్యపై అవ్యాజ్యమైన భక్తితో.. “అయోధ్య శ్రీరామ్” పేరుతో ఆయనపై ఒక ప్రత్యేక ఆల్బమ్ రూపొందించారు ప్రవాస భారతీయులు “సమీర్ పెనకలపాటి”. త్వరలో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సమీర్ పెనకలపాటి “ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్” పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి… “అయోధ్య శ్రీరామ్”తో ఈ బ్యానర్ కు శ్రీకారం చుట్టారు.

ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువుల 500 సంవత్సరాల ఆకాంక్ష అయిన “అయోధ్య రామ మందిరం” విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న చారిత్రక సందర్భంలో “అయోధ్య శ్రీరామ్” ఆల్బమ్ విడుదల చేశారు సమీర్. యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ సారధ్యంలో అచంచల భక్తిశ్రద్ధలతో రూపొందిన “అయోధ్య శ్రీరామ్” గీతాన్ని సత్య కశ్యప్ తో కలిసి… చిన్మయి, స్నిఖిత, శ్రాగ్వి ఆలపించారు. తెలుగులో ఈ గీతానికి ‘చిరంజీవి ఎన్ని’ సాహిత్యం సమకూర్చగా… హిందీలో తన్వీర్ ఘజ్వి రాశారు. “యువర్స్ ఉన్ని” ఈ ఆల్బమ్ కు ఎడిటర్.

ప్రవాస భారతీయులు ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ అధినేత సమీర్ పెనకలపాటి మాట్లాడుతూ “శ్రీ రాముని స్తుతిస్తూ ఒక గీతం రూపొందించే అవకాశం దక్కడం అదృష్ఠంగా, శ్రీరాముని కృపగా భావిస్తున్నాను. ఈ ఆల్బమ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆ అవతార పురుషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామగానంతో మా “ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్”కు శ్రీకారం చుట్టడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ గీతాన్ని ఆంజనేయ – లక్ష్మణ సమేత సీతారాముల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాం” అన్నారు.

Related posts

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

Satyam NEWS

జేఈఈ (మెయిన్), నీట్ “కోటా” గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment