35.2 C
Hyderabad
April 27, 2024 13: 29 PM
Slider నల్గొండ

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

#Lokadalat

డిసెంబర్ 12న, జరగనున్న లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి బి.శ్రీదేవి న్యాయవాదులను, పోలీసు అధికారులను కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కేంద్రంలోని న్యాయస్థానంలో  గురువారం జరిగిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి బి.శ్రీదేవి మాట్లాడుతూ  “రాజీ మార్గమే రాజమార్గం” అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులలో కక్షిదారులు రాజీ పడే విధంగా వారికి అవగాహన కల్పించాలని కోరారు. హుజూర్ నగర్ జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలపాలని న్యాయవాదులను, పోలీసు అధికారులను కోరారు.

జూనియర్ సివిల్ జడ్జి ఏ.శ్రీదేవి మాట్లాడుతూ కాంపౌండ బుల్, క్రిమినల్ కేసులలో, చెక్ బౌన్స్ బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు తదితర కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్ లో రాజీపడి కేసులను రాజీ చేసుకోవచ్చును అన్నారు. పెద్ద మొత్తంలో కేసులు రాజీ అయ్యేవిధంగా అందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చెన్నగాని యాదగిరి, ఎం.ఎస్.రాఘవరావు, సైదులు, చంద్రయ్య, మహేష్, ప్రవీణ్, వి.జి.కె మూర్తి, కొట్టు సురేష్, మీసాల అంజయ్య, సురేష్ నాయక్, అంబటి శ్రీనివాసరెడ్డి, నట్టే సత్యనారాయణ, వట్టికూటి అంజయ్య, పాలేటి శ్రీనివాసరావు, జుట్టుకొండ సత్యనారాయణ, శ్రీను నాయక్, వెంకటేష్,శంకర్, శ్రీనివాస్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సూపరింటెండెంట్ తాటి విజయభాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, శ్యామ్ కుమార్, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ దాహం తక్షణమే తీరుస్తాం

Satyam NEWS

రాజంపేట లో 13 న అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS

గాల్వాన్ హీరోలకు ప్రధాని మోడీ పరామర్శ

Satyam NEWS

Leave a Comment