42.2 C
Hyderabad
May 3, 2024 18: 01 PM
Slider ఖమ్మం

కేసులపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

#court

కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పెండింగ్ కోర్టు కేసులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి 62 టైం బాండ్ కేసులు, 79 డైరెక్షన్స్, 11 ధిక్కార, 323 రిట్ పిటిషన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. సరైన2కౌంటర్లు ఫైల్ చేయాలన్నారు. ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. టైం బాండ్ కేసులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

ధరణి లో దరఖాస్తుదారులు వారి వారి సమస్యలు ఏ ఏ మాడ్యూల్స్ లో దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. కేసుల పరిష్కారం పై వారం వారం సమీక్ష చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపివో హరిప్రసాద్, డిఇఓ యాదయ్య, డిఆర్డీవో విద్యాచందన, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిణి డా. మాలతి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా మత్స్య అధికారి ఆంజనేయ స్వామి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి

Satyam NEWS

కారు ప్రమాదంలో హైదరాబాద్ యువతి బ్రెయిన్‌డెడ్

Satyam NEWS

Leave a Comment