33.7 C
Hyderabad
April 29, 2024 02: 50 AM
Slider హైదరాబాద్

సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్                            

#ghmc

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సత్వర సమస్యల పరిష్కారం కొరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆకాష్ నగర్, మరియు రఘునాథ్ నగర్ లో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి, వెంటనే పారిశుద్ధ సిబ్బందితో పరిసర ప్రాంతాలను క్లీన్ చేయించడం జరిగింది. పనిచేయని వీధి దీపాలను బాగు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నేటి నుంచి 100 రోజులపాటు  సత్వర సమస్యల పరిష్కారం కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో సంబంధిత అన్ని శాఖల అధికారులు పారిశుద్ధ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్ సిబ్బంది, సివరేజి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పాల్గొంటారు. అప్పటికప్పుడు వెంటనే పరిష్కారం అయ్యేటటువంటి పనులు వెంటనే చేయలన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ కూడా చెత్త వేయవద్దని కాలనీ సంగం నాయకులతో కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరుగుతుంది. లేనియెడల వారికి జిహెచ్ఎంసి సిబ్బంది ఫైన్ విధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ హరిశంకర్,ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏ సిబ్బంది పాషా, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, పోలీస్ సిబ్బంది, స్థానిక బస్తి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్, ఈశ్వర్, ఖలీల్, ముబాషీర్, మోహన్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

మున్సిపల్ వ్యర్ధాల నిర్వహణకు తమిళనాడు అధికారుల ప్రశంస

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ ‘హత్య’ మోషన్ పోస్టర్

Satyam NEWS

Leave a Comment