ఏఎస్‌రావు డివిజన్ కుషాయిగూడలోని యువ తేజ ఫ్రడ్స్ యూత్ బబ్బీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి , పిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువ తేజ ఫ్రడ్స్ యూత్ బబ్బీ ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మరియు కమలానగర్ హెచ్‌కె యూత్ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్ర్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీరుకొండ సతీష్‌బాబు , ఎస్‌ఎ.రహీం, పసల ప్రసాద్, బోళ్ళ వెంకటేష్, వెంకటేశ్వరరావు, రామ్మోహన్, రవీందర్ తదితరలు పాల్గొన్నారు.
ఉప్పల్, సత్యం న్యూస్