29.7 C
Hyderabad
April 29, 2024 08: 56 AM
Slider మహబూబ్ నగర్

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం

మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షిద్దామని లక్ష్మీ నివాస్ అన్నారు. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధ్యక్షులు లక్ష్మీనివాస్ అన్నారు. మంగళవారం మహేశ్వరం గేట్ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులతో కలిసి తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి ఎస్ ఎస్ ఓ ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన అనంత కోటి వృక్ష మహోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమాజంలో మార్పులు తీసుకువచ్చే శక్తి విద్యార్థులకు ఉంటుందని విద్యార్థులు సామాజిక స్పృహను అలవర్చుకోవాలని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. చెట్టు లేకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని కాలుష్యం మానవ జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంటి ఆవరణలో వ్యవసాయ పొలాలలో మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర కార్యదర్శి మీసాల వంశీ శివ రవి కుమార్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Related posts

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

Satyam NEWS

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

Satyam NEWS

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment