32.2 C
Hyderabad
May 9, 2024 20: 16 PM
Slider ముఖ్యంశాలు

పోలీస్ అన్న ప‌దానికే అర్దం మార్చిన లేడీ ఎస్పీ

#VijayanagaramSP

నేనేరా పోలీస్, ఖాకీతో పెట్టుకోకు, పోలీసు లాఠీ, థ‌ర్డ్ డిగ్రీ,నేర‌స్థుల‌కు సింహ‌స్వ‌ప్నం…బుహుశా ఈ ప‌దాలు ఆ పోలీస్ సూప‌రెంటెండెంట్ కు వర్తించ‌వేమో. నోటీతో ప‌లికే మాట‌ల‌క‌న్న…చేతుల‌తో చేసే సాయం మిన్న అన్న ప‌దాలకే ఆ ఎస్పీ క‌ట్టుబ‌డి ఉన్నారేమో.

ఓ సౌమ్య మిశ్రా, ఓ స్వాతి ల‌క్రా…వాళ్ల కన్న ఎంతో అమితంగా తాను ప‌ని చేసే ప్ర‌తీ చోట ప‌నిని ప్రేమించే ఆ డైర‌క్ట్ లేడీ ఐపీఎస్ కు..వచ్చే ఏడాదిలో డీఐజీ ప‌ద‌వి అల‌రించ‌నుంది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన బీ.రాజ‌కుమారీ గ్రూఫ్ వ‌న్ ప‌రీక్ష రాసీ నేరుగా ఐపీఎస్ గా ఎంపికై…తొలి పోస్టింగ్ తోనే తానేంటో నిరూపించుకున్నారు.

సేవాతత్పరతతో ప్రజలకు మరింత చేరువగా

ఏడాదిన్న‌ర క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఎస్పీగా వ‌చ్చిన రాజ‌కుమారీకి ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన క‌రోనా క‌ల్లోల‌ స‌మ‌యంలో తానేంటో…త‌న ప‌నేంటో..త‌న సేవా త‌త్ప‌ర‌త ఏంటో జిల్లా ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా చూసారు. పోలీస్ అంటే నేర‌స్థుల‌లో వ‌ణుకు,సామాన్యుల‌కు గుండె ధైర్యం క‌లిగించే పోలీసు అఫీస‌ర్ ల‌లో ఒక‌రు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ.

ఒక్క ఫోన్ కాల్ చేస్తే..ఆప‌ద‌లో ఎవ్వరు ఉన్నా క్ష‌ణ‌కాలంలో ఆదుకునే త‌త్వం ఆ ఎస్పీది.అందులో ఒంటరి యువ‌తి,మహిళ‌,వృద్దురాలు ఎవ్వ‌రైనా సాయం అడిగితే అవ్వ‌దు,వీలుకాదు అన్న ప‌దాలే ఆమె డైరీలో కనిపించ‌వు.

అది శాఖా ప‌రంగా కానీ..సామాన్య ప్రజానీకం కాని ఎవ్వ‌రైనా సాయం అడిగితే త‌క్ష‌ణం స్పందించే గుణం…ఆ ఎస్పీది. ఎనిమిది నెల‌ల పాటు దేశంతో పాటు జిల్లాను అల్ల‌క‌ల్లోలం చేసిన క‌రోనా  స‌మ‌యంలో పోలీసు అంటే అదీ ఎస్పీ అంటే ఏంటో  ప్ర‌త్య‌క్షంగా చేసి చూపించారు.

మధ్యతరగతి కష్టం గురించి తెలిసిన నాయకురాలు

పుష్క‌ర కాలం క్రితం అప్ప‌టి జిల్లా ఎస్పీ మాదిరెడ్డి ప్ర‌తాప్…పోలీసు సిబ్బందికి ర‌క్షిత మంచినీటి ట్యాంకు నిర్మిస్తే….ఏడాదిన్న‌ర క్రితం వ‌చ్చిన ఎస్పీ రాజ‌కుమారీ సిబ్బంది కోసం పెట్రోల్  బంక్ స్థాప‌న‌కే పూనుకుని ఏకంగా బంక్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసారు.

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబీకుల క‌ష్టం ఏంటో స్వయంగా తెలిసిన రాజ‌కుమారీ…. తండ్రి ఆశ‌యం కోసం ఐపీఎస్ సాధించి అడిష‌న‌ల్ సూప‌రెంటెండెంట్ స్థాయి నుంచీ డీఐజీ ర్యాంకుకు చేరుకోబోతున్నారు. క‌ష్టే ఫ‌లే సుఖీ అన్న సూక్తిని ప్ర‌గాడంగా న‌మ్మిన ఎస్పీ రాజుకుమారీ త‌న కింద ప‌ని చేసే సిబ్బందిని శాఖా పరంగా ఎలా న‌డుచుకోవాలో చూసి నేర్చుకోవాల‌ని చెబుతారే త‌ప్ప‌……నేను చెప్పిందే  శాస‌నం అన్న విధంగా వ్య‌వ‌హ‌రించ‌రు.

గొప్ప‌,స్వార్దం, అహం అన్న ప‌దాల‌ను ప‌క్క‌న పెట్టి..జాలి,ద‌య,గుణం అన్న వాటికే విలువ ఇచ్చి వాటితో పోలీస్ యూనీఫాం ధ‌రించి సామాన్యుల‌‌కు సేవ చేయొచ్చ‌న‌ని నిరూపించారు…ఎస్పీ రాజ‌కుమారీ. గ‌తంలో ప‌ని చేసే ఎస్పీలు అంద‌రూ జిల్లాలో అదీ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో త‌న దైన స్టైలిలో ప‌నులు చేయిస్తే… ఏడాదిన్న‌ర క్రితం వ‌చ్చిన ఎస్పీ కూడా స్పంద‌న‌,ఆప‌రేష‌న్ ముస్కాన్, మ‌హిళ మిత్ర‌,మ‌హిళ  ర‌క్ష‌క్,వృద్ధ మిత్ర‌, స్నిప‌ర్ టీం,,మీ ర‌క్ష‌ణే మాధ్యేయం,చేయూత‌,శౌర్య‌,విద్యా కుస‌మాలు వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అటు శాఖా ప‌ర‌గా సిబ్బందికి ఇటు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యారు.

గిరిజనులకు అమ్మగా మారిన ఎస్ పి

గ్రేహౌండ్స్ లో ప‌ని చేసే అనుభ‌వంతో ఆంద్రా,ఒడిషా స‌రిహ‌ద్దులో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల‌లో బిక్కుబిక్కు మంటూ బ‌తుకున్న గిరిజ‌నుల‌కు ఓ అమ్మ‌లా వాళ్లు ఉంటున్న పూరిగుడెస‌లో తాను ఓ ఎస్పీ అన్న‌హోదాలో కాకుండా మామూలు మ‌హిళ‌గా వారి ఇండ్ల‌లో వాళ్ల మ‌నుషుల‌లాగానే గ‌డ‌ప‌టం ఎస్పీ రాజ‌కుమారీ కే చెల్లింది.

ఓ ఏఆర్ కానిస్టేబుల్ కైనా,ఓ లేడీ కానిస్టేబుల్ కు అయినా,ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ కైనా,ఓవృద్దురాలికైనా ఇలా ఆప‌ద‌లో ఉన్న‌వారికి అక్కున చేర్చుకుని పోలీస్ అంటే త‌ప్పు చేసేవారికి గాని త‌ప్పును ఎత్తి చూపేవారికి భ‌యం ఉండ‌కూడాద‌ని చేత‌ల‌లో చూసిన విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ…ప్ర‌స్తుత మహిళా లోకానికే కాకుండా ప్ర‌తీ ఒక్క‌రికీ స్పూర్తిదాయ‌క‌మే.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్, విజయనగరం

Related posts

అక్రమ సంపాదనలో పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Satyam NEWS

 ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ               

Murali Krishna

ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న అభిలాష రావు

Satyam NEWS

Leave a Comment