38.2 C
Hyderabad
April 27, 2024 15: 39 PM
Slider వరంగల్

రహస్యంగా బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు

#Child Marriage

బాల్య వివాహం చేయడం నేరమని, వేరే ప్రాంతానికి వెళ్లి రహస్యంగా బాల్య వివాహం చేస్తే చట్టప్రకారం, తల్లిదండ్రులు పైన, బాల్య వివాహం చేసుకున్న అబ్బాయి పైన, పెళ్లికి హాజరైన వారి పైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ములుగు మండల కేంద్రానికి సమీపంలోని గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం తెలిసిన వెంటనే జిల్లా బాలల పరిరక్షణ విభాగం – జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే.ఓంకార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని బాలిక బాల్య వివాహం చేసే కుటుంబం ఇంటిని సందర్శించగా ముందే సమాచారం తెలుసుకున్న సదరు కుటుంబ సభ్యులు బాలికను తీసుకొని వేరే గ్రామానికి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో ఆ వీధిలోని ఇతర కుటుంబ సభ్యులకు కు ఇంటి చుట్టుపక్కల వాళ్ళను అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో లో బాల్య వివాహాల పైన గ్రామస్తులకు వార్డు సభ్యులకు బాల్య వివాహ నిరోధక చట్టం 2006 పైన అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ జ్యోతి, రజక్_ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో, సఖి సెంటర్ అడ్మిన్ రజిత, కౌన్సిలర్, పోలీస్ కానిస్టేబుల్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రభ, ఔట్రీచ్ వర్కర్ శ్వేత, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Satyam NEWS

తునికాకు సేకరణదారులకు బోనస్ చెల్లింపు

Satyam NEWS

శోభాయమానంగా పిల్లలమర్రి దేవాలయాలు

Murali Krishna

Leave a Comment