37.2 C
Hyderabad
May 2, 2024 14: 47 PM
Slider ఖమ్మం

అవసరమైన వారందరికి కళ్ళజోళ్ల పంపిణి చేయాలి

#collector

కంటి వెలుగు కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాలకనుగుణంగా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికి కళ్ళజోళ్ల పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.  సమీకృత జిల్లా కార్యాలయల భవన సముదాయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కంటి వెలుగు పురోగతి, సాధారణ ప్రసవాలు, క్షయవ్యాధి బాధితుల గుర్తింపుపై కలెక్టర్‌ సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో సాధించిన పురోగతిని, ప్రిష్‌కిప్షన్‌ కళ్లజోళ్ల పంపిణీ,  వివరాలను అడిగి తెలుసుకున్నారు.  నిర్దేశిత సమయంకంటే ముందుగానే పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేయాలన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భీణీకి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు.  ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసి క్షయవ్యాధి బాధుతులను గుర్తించి బాదితులకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లాలో 171 హెల్త్, వెల్ నెస్ కేంద్రాలు గుర్తించినట్లు, ఇందులో 164 ప్రభుత్వ, 7 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇందులో క్రొత్తగా మంజూరైన 53 కేంద్రాలు పోనూ, మిగతా చోట్ల పెయింటింగ్ పనులు చేపట్టి, పూర్తి చేయాలని,  లోగో, ఇతర సూచనలు సమాచారం ఇస్తామని ఆయన తెలిపార. ఈ సమీక్ష లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బి. మాలతీ, ఉప వైద్య, ఆరోగ్యాధికారి డా. రాంబాబు, డా. సైదులు,  డా. సుబ్బారావు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

వరద సాయం చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలం

Satyam NEWS

హిందూస్థాన్ డీజే యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

విద్యార్ధుల బుద్ధి కుశలతకు పదును పెట్టే చదరంగం

Satyam NEWS

Leave a Comment