30.7 C
Hyderabad
April 29, 2024 06: 49 AM
Slider రంగారెడ్డి

వర్గీకరణ చేసేవరకూ ఉద్యమం తీవ్రతరం

#mrps

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్బులో ఎమ్మార్పీఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ వివిధ అనుబంధ సంఘాల విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోయిన్చార్జి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ, జిల్లా, నూతన కమిటీలను పరిపూర్ణంగా వేసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉదృతంగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించే వరకు మరో  పోరాటానికి సిద్ధం కావాలని, మందకృష్ణ మాదిగ 28 సంవత్సరాల ఉద్యమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల్లోని అన్ని వర్గాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పంచేవరకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమిస్తామని తెలిపారు.

అదే విధంగా దేశంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం రిజర్వేషన్ వర్గాల ప్రజలను విద్యా,ఉద్యోగ,ఆర్థిక రంగాలలో దెబ్బ తీయడంలో భాగమే నని అన్నారు. ఈ విషయం మీద రానున్న కాలంలో కలిసి వచ్చే వివిధ భాగస్వామ్య పక్షాల తో దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసం శ్రేణులు సన్నద్ధం కావాలని పిలునిచ్చారు. డిసెంబర్ 21 మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ మహాసభను అలాగే జనవరి 6న బెంగళూర్ లో జరిగే MRPS జాతీయ మహాసభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు చిరంజీవి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్చార్జి మల్లికార్జున్, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు రవి, పెద్దల్లో ఆనంద్ కుమార్, మల్లేష్ ,పుష్పలత, రమేష్ VHPS నాయకులు ఆనంద్ కుమార్ మరియు రాజేందర్, నర్సింలు, హరేందర్, వెంకటేష్, బాబురావు మాదిగ, డప్పు మోహన్ మాదిగ ,తదితర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఎస్ ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కోర్టుకు వెళ్లి పరువు పోగొట్టుకున్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS

ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో లక్షల్లో ఫీజులు

Satyam NEWS

దోచుకుతింటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Satyam NEWS

Leave a Comment