25.2 C
Hyderabad
May 8, 2024 07: 13 AM
Slider శ్రీకాకుళం

ఒలంపియాడ్‌ పరీక్షలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

#srichitanya

దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఒలంపియాడ్‌-2023 (నాలెడ్జ్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌) పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్ కోలనీ శ్రీచైతన్య  పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీలో నిర్వహించిన ఒలింపియాడ్‌లో అత్యధికంగా 260 మంది విద్యార్ధినీ,విద్యార్ధులు సెకెండ్ లెవెల్ కు అర్హత సాధించి అద్వితీయమైన ప్రతిభను కనబరిచారని దేశంలోని మరే ఇతర విద్యా సంస్థ ఇంతటి ఫలితాలను సాధించలేదన్నారు. ఈ ఫలితాలతో భారతదేశంలో శ్రీ చైతన్య నం.1 అని మరో సారి నిరూపితమైందని పేర్కొన్నారు.

మేథ్స్ విభాగం నుండి 85 మంది విద్యార్ధినీ  విద్యార్ధులు, ఫిజిక్స్ విభాగం నుండి 73 మంది, కెమిస్ట్రీ విభాగం నుండి 102 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు సెకెండ్ లెవెల్ కు అర్హత సాధించి ఎంపికయ్యారని క్యాంపస్ మొత్తము సెలెక్షన్స్ 260 మంది   విద్యార్ధినీ విద్యార్ధులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థల  రీజనల్ ఇంచార్జి ఎస్.రామి నాయుడు, ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్దినేట‌ర్ ఏ.బాల రాజు, జోనల్ అకడమిక్ డీన్  పి.మోహన్ బాబు, పాఠశాల అకడమిక్ డీన్ సి.హెచ్.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఇంద్ర మౌళి,  ఐపియల్ ఇంచార్జి బి.జనార్ధన్, సి భ్యాచ్ ఇంచార్జి  ఎస్.లక్ష్మీకాంత్  సివిల్స్ బ్యాచ్ ఇంచార్జి బి.ప్రసాద్, మెడికాన్ ఇంచార్జి టి.రామ్మోహన్ , పాఠశాల ఏ.ఓలు పి.శ్రీనివాసరావు, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి

Satyam NEWS

హుజుర్ నగర్ నియోజకవర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు

Satyam NEWS

వచ్చే నెల 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ కౌన్సిలింగ్

Satyam NEWS

Leave a Comment