28.7 C
Hyderabad
April 27, 2024 05: 26 AM
Slider జాతీయం

వచ్చే నెల 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ కౌన్సిలింగ్

#IIITCouncilling

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది.

ఈ సంస్థల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆరు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు.

మొదట విడత సీట్ల కేటాయింపు కన్నాముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్‌ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు.

Related posts

ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి

Bhavani

తీన్మార్ మల్లన్న పాదయాత్రను విజయవంతం చేయాలి

Satyam NEWS

సుమసిరి

Satyam NEWS

Leave a Comment