37.2 C
Hyderabad
May 2, 2024 12: 44 PM
Slider ఆధ్యాత్మికం

సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు

padmavathi ammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలోని సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందు తున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

వాహనసేవల్లో పెద్ద జీయ‌ర్‌స్వామి, చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో పి.బ‌పంత్‌కుమార్‌ దంపతులు, సిఇ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ కుమార్, ఏవిఎస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

బంగాళాఖాతంలో అల్పపీడనం

Murali Krishna

కరోనా లేదని చెప్పిన వారు నేడు ఇంటికే పరిమితం

Satyam NEWS

రెలిజియనిజం: లక్ష్మణ రేఖ దాటిన అంధ మత విశ్వాసం

Satyam NEWS

Leave a Comment