35.2 C
Hyderabad
May 29, 2023 20: 29 PM
Slider ఆధ్యాత్మికం

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

#Tirumala

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు  ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరినీళ్లు, చందనంలతో అభిషేకం చేశారు.

 వాహ‌న‌సేవ‌లో  తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ  డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, కంకణబట్టార్ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సురేష్, చలపతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల సందర్భం…ఏపీలో భారీ గా ఏఎస్పీల బదిలీలు…!

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్‌వ‌ర‌ణం

Satyam NEWS

స్ట్రాటజీ: ప్లాన్ మూడో దశలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!