29.7 C
Hyderabad
May 3, 2024 06: 01 AM
Slider నల్గొండ

స్టాప్ నర్సు పోస్టులు,ఏ.ఎన్.ఎం పోస్టులు వెంటనే భర్తీ చేయండి

#aziz pasha

రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిస్టులు జి.ఎన్.ఎం లు,ఎ.ఎన్.ఎం లు లక్షలాది మంది కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నోటిఫికేషన్ 57/2017 స్టాప్ నర్సుల నియామకాలు పెండింగ్ ఉన్నాయని,పెండింగ్ ఉన్న పోస్టులు 893 ఫలితాలు ప్రకటించకుండా  ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులను,ఎ.ఎన్.ఎం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసే ఈ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనితో సుమారు 4 సంవత్సరాలుగా సర్వీస్,వయోపరిమితి కోల్పోతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎ.ఎన్.ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 5/2018 పరీక్షలు నిర్వహించి నేటికి కూడా ప్రభుత్వం ఫలితాలను ప్రకటించకుండా కాలయాపన చేయటం తగదని,ప్రభుత్వం అరాకొరా నోటిఫికేషన్లు ఇచ్చి సంవత్సరాలు సంవత్సరాలుగా ఫలితాలను ప్రకటించకుండా పెండింగ్ లో పెడుతూ నిరుద్యోగ యువతీ,యువకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు.

దీనితో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే యువతి,యువత ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వలన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగ యువతి, యువకులకు ఇచ్చిన నోటిఫికేషన్లో ఫలితాలను ప్రతీసారి పెండింగ్ లో ఉంచుతూ ప్రభుత్వం ఎంపిక చేయబడిన వీరికి డ్యూటీలో చేరితే  జీతాలు ఇవ్వవలసి వర్తిస్తుందని,  ప్రమోషన్లు కల్పించవలసిన అవసరం ఉంటుందని ప్రతి ఉద్యోగాలలో కోతలు విధిస్తున్నారని అన్నారు.

టి.ఎస్.పి.ఎస్.సి ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులు మొత్తం 3311 అందులో నుండి 893 మంది అభ్యర్ధులకు ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారని, పెండింగ్ లో ఉన్న 893 మందికి కూడా వెంటనే ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగం కల్పించిన వారితో పాటుగా నాటి నుండే వీరికి కూడా అదే సర్వీస్ రూల్స్ వర్తింపజేస్తూ అప్పటినుండి ఇప్పటివరకు నెల నెల వేతనాలను కూడా వీరికి వర్తింపజేయాలని కోరారు.ఎ.ఎన్.ఎం పోస్టుల ఫలితాలను కూడా వెంటనే ప్రకటించి సుమారు మూడు సంవత్సరాల సర్వీస్ వీరికి వర్తింపజేస్తూ వేతనాలు కూడా పరీక్షలు రాసిన ఉద్యోగం సాధించిన వారికి నాటి నుండే రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా వేతనాలు చెల్లింపు చేయాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది స్టాఫ్ నర్సులు,ఫార్మాసిస్టులు, ఎ.ఎన్.ఎం ల కోర్సులు పూర్తి చేసి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కొరకు ఎదురుచూస్తున్నారని, వీరికి ఉద్యోగ వయోపరిమితి దాటకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, ఎ.ఎన్.ఎం పోస్టుల భర్తీ లకు వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి జి.ఎన్.ఎం,ఎ.ఎన్.ఎం.లను ఆదుకోవాలని అజీజ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముషం సత్యనారాయణ, బాచిమంచి గిరిబాబు,ఎస్.కె. బిక్కన్ సాహెబ్,పాశం రామరాజు,దొంతగాని జగన్,ఎస్.కె.అజ్ఞు తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యూ వైరస్ :మీడియాకు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వ్యాధి

Satyam NEWS

విద్యాసంస్థల రీ-ఓపెన్ కు కేంద్ర మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment