31.2 C
Hyderabad
May 3, 2024 02: 41 AM
Slider ఖమ్మం

బాధితులకు అండగా నిలవండి

#Potu Prasad

భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. వాగులు, ఏర్లు, నది పరివాహాక ప్రాంతాలలో భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయని, పలు చోట్ల భూములు కోతలకు గురయ్యాయని ప్రసాద్ తెలిపారు.

నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేలు పరిహారం అందజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి -రూ. 10 వేలు ఇవ్వాలని శ్రీ కోరారు. వాగులు, ఏర్లు ఉప్పొంగి పలువురు నిరాశ్రయులయ్యారని జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయని ఆయన తెలిపారు. వరద బాధితులకు తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించాలని, ఇండ్లు కూలిపోయిన వారికి, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందించాలని కోరారు.

ప్రభుత్వం వరద బాధిత ప్రాంతాలతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నందున పిహెచ్సిలలో మందులను, సిబ్బందిని సంసిద్ధం చేయాలని ఆయన తెలిపారు. హెల్త్ క్యాంపులను నిర్వహించి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రసాద్ తెలిపారు.

Related posts

ఆఫ్టర్ 30 డేస్:నైజీరియాలో 19మంది ఇండియన్స్ విడుదల

Satyam NEWS

రెయిన్ హవాక్: హైదరాబాద్ నగరంలో వడగండ్ల వాన

Satyam NEWS

మరో క్రైమ్:బోధన్ పట్టణంలో యువతిపై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment