40.2 C
Hyderabad
April 29, 2024 15: 58 PM
Slider చిత్తూరు

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

#naveen

తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం ఆందోళనకరమైన విషయం. అలిపిరి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నా డ్రోన్ కెమెరా తిరుమల కొండకు ఎలా వెళ్లగలిగింది? ఘాట్ రోడ్లో పబ్లిక్ గా శేషాచలం కొండలను ఎలా డ్రోన్ కెమెరాతో షూట్ చేయగలిగారు అన్నదానిపై సమగ్ర దర్యాప్తు జరిపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద “మెటల్ డిటెక్షన్” వ్యవస్థ పటిష్టంగా ఉంది కానీ ప్లాస్టిక్ డిటెక్షన్ వ్యవస్థ టిటిడిలో అందుబాటులో లేకపోవడంతో “ప్లాస్టిక్ డ్రోన్ కెమెరాలు” చెకింగ్ పాయింట్ దాటి తిరుమల కొండకు వస్తున్నాయన్నారు.

టిటిడి అధికారులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని చెకింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించే విధంగా టోల్ చెకింగ్ పాయింట్ వద్ద రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ విమానాశ్రయాలలో తిరుమల కొండకు నిషేధిత పదార్థాలు వస్తువులు అన్న సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి ఎస్వీబీసీ అలాగే ప్రైవేట్ చానల్స్ ద్వారా తిరుమల భద్రత నిషేధిత వస్తువుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తెలిసో తెలియకో తీసుకొచ్చే నిషేధిత వస్తువుల కారణంగా భద్రత విషయంలో భక్తులలో ఆందోళనలు కలుగుతున్నాయి అన్నారు.

టీటీడీ ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు

1) భక్తులకు అవగాహన కల్పించే విధంగా నిషేధిత వస్తువులు, పదార్థాలు అన్న సూచిక బోర్డులు, విస్తృత ప్రచారం ద్వారా యాత్రికుల సంచారం ఉండే ప్రతి చోటా ఏర్పాటు చేయాలి.

2) అలిపిరి టోల్ చెకింగ్ పాయింట్ లో ప్రస్తుతం “మెటల్ డిటెక్షన్ వ్యవస్థ” ఉంది దానికి తోడుగా “ప్లాస్టిక్ డిటెక్షన్” వ్యవస్థను తీసుకువస్తే ప్లాస్టిక్ డ్రోన్ కెమెరాలను విజిలెన్స్ సిబ్బంది పసిగట్టి చెకింగ్ పాయింట్ వద్ద స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Related posts

వితంతువులు స్వశక్తితో ఎదగాలి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్

Satyam NEWS

తిరుపతి లో బ్రాహ్మణ సర్వసభ్య సమావేశం…!

Satyam NEWS

ఎస్పీ బంగ్లా దారిలో నిలచిపోయిన ఆర్టీసీ బస్…!

Satyam NEWS

Leave a Comment