37.2 C
Hyderabad
May 2, 2024 11: 07 AM
Slider విజయనగరం

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

#collector

గ‌డ‌చిన‌ నాలుగున్న‌రేళ్లుగా జ‌ర్న‌లిస్టల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని  ప్ర‌భుత్వం కిమ్మ‌న‌కుండా ఉంద‌ని విజ‌య‌న‌గ‌రంలో జ‌ర్న‌లిస్టులంతా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇటీవ‌లే రెండు ప‌త్రిక‌ల‌కు సంబంధించిన విలేక‌రుల పై దాడిని ఖండిస్తూ…విజ‌య‌న‌గరం జ‌ర్నిస్టులంతా ఏక‌మై…క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మికి విన‌తి ప‌త్రం అంద‌చేసారు. తొలుత క‌లెక్ట‌రేట్ క్యాంటిన్ వ‌ద్ద సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు శివ‌ప్ర‌సాద్, మ‌హాపాత్రో, పంచాది అప్పారావు, కే.జే.శ‌ర్మ‌,ర‌వికుమార్, పంతులు ,గౌరీశంక‌ర్  త‌దిత‌ర జ‌ర్న‌లిస్టుంతా క‌లిసి….ఈ దాడుల‌ను ముక్త కంఠంతో ఖండించారు. అనంత‌రం ర్యాలీ గా క్యాంటిన్ నుంచీ బ‌య‌లు దేరి నేరుగా క‌లెక్ట‌ర్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు.

అక్క‌డే క‌లెక్ట‌ర్ ను  క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు ధ‌ఫేదారుడ్నిఅనుమ‌తి కోరారు. అయితే క‌లెక్ట‌ర్ టెలీ కాన్ఫ‌రెన్స్ లో ఉండ‌టంతో కాస్సేపు ఆగ‌మ‌ని  చెప్పారు. అంత‌కు ముందే క‌లెక్ట‌ర్ పేషీ నుంచీ అనుమ‌తి తీసుకోవాల‌ని చెప్న‌డంతో…పేషీ అనుమ‌తితో ఎట్ట‌కేల‌కు క‌లెక్ట‌ర్ ను జ‌ర్న‌లిస్టుంతా కలిసి విన‌తి ప‌త్రం ఇచ్చారు. దాడుల‌కు గ‌ల కార‌కుల‌ను శిక్షించాల‌ని కోరారు. ప్ర‌భుత్వంపై వార్త‌లు రాసినంత మాత్రానా…ఇలా భౌతిక దాడుల‌కు పాల్ప‌డటం అప్ర‌జాస్వామిక‌మ‌ని జ‌ర్న‌లిస్టులు క‌లెక్ట‌ర్ కు విన్న‌వించారు. అనంత‌రం పోర్ట్ కోలో జ‌ర్న‌లిస్టు నేత‌లు శివ‌,పాత్రో,బూశ్రీలు మాట్లాడుతూ వైఎస్.ఆర్సీపీ ప్ర‌భుత్వంలో జ‌ర్న‌లిస్టుల పై దాడులు అధికం అయ్యాయ‌న్నారు. రాసిన వార్త‌ల‌లో ఇబ్బంది కాని లోపం కాని..వ‌చ్చిన ప‌క్షంలో రిజాయిండ‌ర్ ఇవ్వొచ్చుకాని…ఇలా  భౌతికంగా దాడులు చేయ‌డం  హేయ‌మైన చ‌ర్య అని అన్నారు.

Related posts

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

పోలవరంపై ఇంతకాలం మభ్య పెట్టి ఇప్పుడు చేతులు ఎత్తారు

Satyam NEWS

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment