37.7 C
Hyderabad
May 4, 2024 13: 39 PM
Slider తూర్పుగోదావరి

పోలవరంపై ఇంతకాలం మభ్య పెట్టి ఇప్పుడు చేతులు ఎత్తారు

#chandrababu

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరాలు:

దేశానికి అన్నంపెట్టిన ప్రాంతం  గోదావరి డెల్టా. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కాటన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంతో ఆయన ఇక్కడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. మంచిపని చేస్తే ప్రజ లు అభిమానిస్తారు అనడానికి ఇదే నిదర్శనం.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ జిల్లాలో ప్రతిఎకరాకు నీరు అందుతుంది. అలానే పరిశ్రమలకు నీటిసమస్య ఉండదు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వం సంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న మేం, మాకు న్న వనరులతో సేకరించిన సమాచారంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కార్యక్రమం.

రాష్ట్రంలో 5 ప్రధాన నదులతో కలిపి మొత్తం 69 నదులున్నాయి. ముఖ్యమైన గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదుల్ని అను సంధానం చేస్తే రాష్ట్రంలో నీటిసమస్యే ఉండదు.  ఈ ఐదు నదులు ఎక్కడో పుట్టి, మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తాయి.

సముద్రం ఎత్తుకి భూమిఎత్తుకి  మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడం ఈ రాష్ట్రానికి ఉన్న అవకాశం. సాధారణ లిఫ్టులతో కాస్త తక్కువలో ఉన్న నీటిని పైకి తరలించవచ్చు.

ఎన్టీఆర్ హాయాంలో తెలుగుగంగ, హంద్రీనీవా వస్తే, నేనువచ్చాక ముచ్చు మర్రి పూర్తిచేసి,  సీమకు కృష్ణా, గోదావరి నీళ్లు తరలించాము. మొట్టమొద టిసారి కృష్ణా-పెన్నా నదుల్ని ఎన్టీఆర్ అనుసంధానం చేస్తే, నేను వచ్చాక పోలవరం ప్రధాన కుడికాలువపై పట్టిసీమ నిర్మించి, 120టీఎంసీల గోదా వరి నీటిని ప్రకాశం బ్యారేజ్ కి తరలించాం.

ఆ 120టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు అందించి, ఆ ప్రాంతానికి అందించా ల్సిన కృష్ణానీటిని శ్రీశైలంలో పొదుపుచేసి, అక్కడినుంచి రాయలసీమకు తరలించాం. గోదావరి నీటిని  తరలించడం వల్లే రాయలసీమకు లబ్ధికలిగిం ది. అదిజరక్కపోతే సీమ కరువు తీరేదికాదు.

ఉత్తరాంధ్రలో నాగావళి వంశధార నదుల్ని హీరబ్యారేజ్ ద్వారా కలిపాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే గోదావరి నీరు అక్కడికి తరలించవ చ్చు. రాజమహేంద్రవరం నుంచి సముద్రంలోకి పోయే నీటిని రాయలసీమకు తరలించవచ్చు. ఈ విధంగా తరలించిన నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపితే, 4, 5 ఏళ్లు వర్షాలు లేకపోయినా  ఇబ్బంది ఉండదు.                                                                                                                                                  సాగునీటి

రంగానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి 2014-19లో టీడీపీప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా చేపట్టిన ప్రాజెక్టుల్ని పూర్తిచేసి, రా ష్ట్రానికి నీరు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేశాం. మాహాయాంలో సాగునీటి రంగాని కి రూ.68,293కోట్లు ఖర్చుపెడితే, వీళ్లు వచ్చాక నాలుగేళ్లలో కేవలం రూ.22, 165కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. మొత్తం రాష్ట్రబడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం 9.63 శాతం నిధుల్ని సాగునీటిరంగానికి వెచ్చిస్తే,  ఈ ప్రభుత్వం 2.35శాతమే పెట్టింది. దీన్నిబట్టే ఈ ప్రభుత్వం సాగునీటిరంగంపై ఎంతశ్రద్ధగా పనిచేసిందో తెలుస్తుంది.

ఈ నాలుగేళ్లలో వీళ్ల నిర్వాకంతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం తగ్గితే, తెలంగాణలో పెరిగింది. గతంతో పోలిస్తే తెలంగాణలో సాగువిస్తీర్ణం పెరిగింది. 90లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో  ఏపీ కంటే తెలంగాణ ముందుంది.

టీడీపీ హాయాంలో పోలవరం పనుల్లో గిన్నిస్ రికార్డులు…కేంద్రమంత్రుల ప్రశంశలు.

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించాక అక్కడి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. ఒక మంచి ప్రాజెక్ట్ ను  ఒక దుర్మార్గుడు ఏవిధంగా నిర్వీర్యంచేశాడో కళ్లముందు కని పించింది. టీడీపీ హాయాంలో పోలవరం నిర్మాణం వేగంగా జరిగింది. దేశంలో మరే జాతీయప్రాజెక్టులో జరగనంత వేగంగా పనులు జరిగేలా చూశాం. నదీప్రవాహాన్ని దారిమళ్లించి పనులు చేశాం. మా హాయాంలో 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు  చేసి గిన్నిస్ రికార్డు సాధించాం. ఏప్రాజెక్టులో లేని విధం గా భారీగేట్లు అమర్చాం.

దేశంలో ఉండే ఇంజనీర్లు, ఐఐటీ నిపుణులు వారి తెలివి తేటల్ని ప్ర్రాజెక్ట్ నిర్మాణంకోసం తమతో పంచుకున్నారు. పోలవరం నిర్మాణానికి టీడీపీ హాయాంలో రూ.11,537కోట్లు ఖర్చుపెట్టి, 72శాతం పూర్తిచే శాం. జరిగిన పనుల్ని చూసి కేంద్రమంత్రులు అభినందించారు. పీపీఏ సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లు. రూ.55,548కోట్ల నిర్మాణవ్యయానికి ఆమోదం పొందాము.

నిర్వాసితులకు పరిహారంతో పాటు, ఇళ్లు నిర్మించాం.  ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4,611కోట్లు ఖర్చుపెట్టింది. అది కూడా మాహాయాంలో జరిగిన పనులకు కేంద్రప్రభుత్వమిచ్చిన సొమ్ము. దాన్ని సక్రమంగా నిర్మాణానికి వినియోగించకుండా కేవలం కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపె ట్టారు. స్వార్థప్రయోజనాలకోసం ప్రాజెక్ట్ ఎత్తుని 41.15మీటర్లకు పరిమితం చేయ డానికి సిద్ధమయ్యారు. పనులు గాలికొదిలేశారు…

వరదల్లోప్రాజెక్ట్ ని ముంచేశా రు. ఆఖరికి నిర్వాసితులకు న్యాయంచేయలేక వారిని కొండలు, గుట్టల పాలు చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో జరిగిన పనులపై పీపీఏ నిపుణులు, కేంద్రమంత్రులు చీవాట్లు పెట్టే పరిస్థితి. అదీ వీళ్లు సాధించింది. మా హాయాంలో పట్టిసీమ నిర్వాసితులకు ఎకరా కు రూ.19లక్షలు ఇస్తే, అంతమొత్తం పోలవరం నిర్వాసితులకు ఇస్తానని నమ్మిం చాడు. సకలవసతులతో నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక వారి ముఖంకూడా చూడలేదు. అడిగితే ఏవేవోచెప్పి తప్పించుకుంటాడు.                                                                                                                                                 

పోలవరం నిర్మాణంపై జగన్ రెడ్డి చేతులెత్తేశాడు

నిన్నకూడా జగన్ రెడ్డి 41.15 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్ట్ నిర్మాణమంటున్నాడు. ప్రాజెక్ట్ నిర్మించలేనని చేతులెత్తేశాడు.  కేంద్రప్రభుత్వమే నిర్మించాలంటున్నాడు. కేంద్రం చేయదని ఎవరు చెప్పారు.. ప్రాజెక్ట్ ని చెడగొట్టవద్దని అటు కేంద్రం, ఇటు మేం మొత్తుకున్నాం. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకా రం  ప్రాజెక్ట్ నిర్మించడమే.

ప్రధానమంత్రికి చెప్పాను.. ఆయన్నే బటన్ నొక్కమ న్నాను అని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంటున్నాడు. మరి ఆనాడు కేంద్రం వద్ద ని చెప్పినా వినకుండా వితండవాదం చేసి మూర్ఖత్వంతో ఎందుకు పనులు రద్దు చేశాడు? రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి కాంట్రాక్ట్ సంస్థల్ని ఎందుకు మార్చాడు. దానికి సమాధానం చెప్పడు? ఇతను చేసిన పిచ్చిపనులకు కాపర్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్ మొత్తం పోయాయి. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్ర మే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అదీ ఇతని పద్ధతి. 2019లో అధికారంలోకి వచ్చీరాగానే జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల్ని మార్చాడు. దాంతో పనులు నిలిచి పోయాయి. 6 నుంచి 8నెలలపాటు ప్రాజెక్ట్ ప్రాంతంలో అధికారులు కాంట్రాక్ట్ సంస్థలు ఎవరూ లేకుండాపోయారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల వరదలకు మా హాయాంలో నిర్మించిన లోయర్ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యా మ్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నా యనేదానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చింది.

దానిలో 14 కారణాలు చెబితే, 13 కారణాలు వైసీపీప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయి.  2020 జూన్ నాటికి పూర్తికావాల్సిన ప్రాజె క్ట్ ని 2025కి పూర్తిచేస్తా నని కబుర్లు చెబుతున్నాడు. ఈయన మళ్లీవచ్చి ప్రాజెక్ట్ పూర్తిచేసి …ఇదంతా జరిగేదేనా? ఒక మూర్ఖుడు అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఎంతనష్టం జరుగుతుందో చెప్పడాని కి ఇదే పెద్ద కేస్ స్టడీ. ఇలాంటి వాడిని మేథావులు ముసుగులో ఉన్న కొందరు సిగ్గులేకుండా ఇంకా సమర్థిస్తున్నారు. వాళ్లకు రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకంటే స్వార్థప్రయోజనాలే ముఖ్యమయ్యాయి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు

పురుషోత్తమ పట్నం లిఫ్ట్ ఇరిగేషన్.

ఇది పూర్తయ్యేలోపు అటు కృష్ణాడెల్టాకు నీరు అందించడానికి పట్టిసీమ నిర్మిం చాం.  ఇటువైపు పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఏర్పాటుచేశాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆయకట్టు 1,35,000ఎకరాలు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ప్రాంతాల్లో 67,614 ఎకరాలస్థిరీకరణకు అవకాశముంది. పురుషోత్తమపట్నం నుంచి స్టేజ్ -1 పనుల్లో భాగంగా పోలవరం కాలువకు 10పంపులతో 350క్యూసెక్కులు తరలిం చడం, స్టేజ్ -2 లో పోలవరం కెనాల్ నుంచి ఏలేరు రిజర్వాయర్ కు 8పంపులతో 175 క్యూసెక్కుల నీరు తరలింపు. 10-01-2017లో పనులు ప్రారంభించి, 31-07-2018లో పూర్తిచేశాం. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, రూ.1835 కోట్లు అయితే, రూ.1578కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.13కోట్లు ఖర్చుపెట్టింది. ఇది మొత్తం పూర్తయి  ఏలేరులో 23టీఎంసీలు నిల్వచేయగలిగితే, దానికింద ఉన్న ఆయకట్టుతోపాటు, విశాఖపట్నం జిల్లాకు నీళ్లు పారేవి.

ఏలేరు డెల్టా ఆధునికీకరణ…

మొత్తం ఆయకట్టు 53,017 ఎకరాలు, మొత్తం ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.295. 83కోట్లు. టీడీపీహాయాంలో రూ.46కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ప్రభుత్వంలో కేవలం రూ.12కోట్లు మాత్రమే పెట్టారు. పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.                                                                                                                                                         

గోదావరి డెల్టా ఆధునికీకరణ…

మొత్తం ఆయకట్టు 10.13లక్షల ఎకరాలు. తూర్పుగోదావరిలో 4.79లక్షల ఎకరా లు. చివరి భూములకు నీరివ్వడానికే ప్రాధాన్యత ఇచ్చాం. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.3,361కోట్లు. టీడీపీహాయాంలో రూ.813కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీ వచ్చాక రూ.123కోట్లు ఖర్చుపెట్టింది. నాలుగేళ్లలో 5శాతం పనులు పూర్తిచేయలే క మొత్తం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేశారు.                                                                                                                                                             

గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్…

మొత్తం ప్రాజెక్ట్ అంచనా రూ.851.94కోట్లు. టీడీపీహాయాంలో రూ.236కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.7కోట్లుకూడా ఖర్చుపెట్టలేదు. గోదా వరి ఫ్లడ్ బ్యాంకుల పటిష్టానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవి పటిష్టం చేయ కపోతే, మొత్తం తూర్పుగోదావరి జిల్లాకే ప్రమాదం. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో రూ.కోటి వ్యయంతో గేట్లు పెట్టలేకపోయారు వీళ్లు. అలాంటి ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా?  అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయి 70మంది వరకు చనిపోతే, వీళ్లు ఏమీ పట్టించుకోలేదు.                                                                                                                                        

తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం…

మొత్తం ఆయకట్టు 1.85లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్ట్ తో సాగునీటితో పాటు, 18 మండలాలకు తాగునీరు అందుతుంది. మొత్తం అంచనావ్యయం రూ.674.52 కోట్లు. 2003లో టీడీపీప్రభుత్వమే శంఖుస్థాపన చేసింది. మరలా టీడీపీ హాయాం లో 2018లో ప్రారంభించి, రూ.144కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీ వచ్చాక రూ.54 కోట్లు ఖర్చుపెట్టింది. అదికూడా కేవలం మెయింటినెన్స్ కోసమే.

ముసురుమిల్లి రిజర్వాయర్…

మొత్తం ఆయకట్టు 22,316 ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.207కోట్లు.  ఈరిజర్వాయర్ ద్వారా 22,316 ఎకరాలకు సాగునీరు అందితే, అందులో 10,543 ఎకరాలు అచ్చంగా గిరిజనభూములే. 23 గ్రామాలకు తాగునీరు అందు తుంది. టీడీపీహాయాంలో రూ.6కోట్లు ఖర్చుపెట్టాం.  ఈ ప్రభుత్వం వచ్చాక కేవ లం రూ.27లక్షలు మాత్రమే పెట్టారు. చివరకు రిజర్వాయర్ మెయింటినెన్స్ కూడా నిలిపేశారు.                                                                                                                                             

వెంకటనగరం లిఫ్ట్….

మొత్తం ఆయకట్టు 34వేలఎకరాలు. 3 లిఫ్టులతో గోదావరి నీటితో ప్రస్తుతం ఉన్న పంపింగ్ స్కీమ్ పునరుద్ధరించవచ్చు. దాంతో 4,250ఎకరాల ఆయకట్టు స్థిరీకరిం చవచ్చు. 29,750 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మొత్తం అంచనా వ్యయం రూ.124.18కోట్లు. టీడీపీహాయాంలో రూ.11.91కోట్లు ఖర్చుపెట్టాం. వీళ్లు వచ్చాక రూపాయిపెట్టలేదు.

భూపతిపాలెం రిజర్వాయర్…

 మొత్తం ఆయకట్టు 11,526 ఎకరాలు, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.187.91 కోట్లు. టీడీపీహాయాంలో రూ.7.60కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. కోటి 24 లక్షలు పెట్టింది.  ప్రస్తుతం మెయింటినెన్స్ కూడా జరగడం లేదు.  ఈరిజర్వాయర్ ద్వారా రంపచోడవరం, గంగవరం మండలాల్లోని 32 గ్రామాల్లోని 11,526 ఎకరాల గిరిజన ఆయకట్టుకు నీరు అందుతుంది. గిరిజనగ్రామాలకు తాగునీరు అందించవచ్చు.

చాగల్నాడు ఎత్తిపోతల పథకం…

మొత్తం ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.70కోట్లు. 1997లో తెలుగుదేశం ప్రభుత్వం లో శంఖుస్థాపన చేశాం. 2003లో నిర్మాణపనులు ప్రారంభించాం. 2.85టీఎంసీల నీటితో 22వేల ఎకరాలకు నీళ్లు అందించవచ్చు. దాంతో 35గ్రామాలకు లబ్ధి కలు గుతుంది. అప్పట్లో ప్రాజెక్ట్ పూర్తయినా, 2014లో టీడీపీప్రభుత్వం వచ్చాక రూ.17 కోట్లు ఖర్చుపెట్టి చిన్నచిన్న పనులు పూర్తిచేశాం. వైసీపీ వచ్చాక ప్రాజెక్ట్  నిర్వహణనే పట్టించుకోకుండా వదిలేసింది.

తూర్పుగోదావరిజిల్లాలోని ప్రాజెక్టుల నిర్వహణకు డబ్బులివ్వరు.. చిత్తూరులో మంత్రికి మాత్రం రూ.8 వేలకోట్ల టెండర్లు కట్టబెట్టారు.

చిన్నప్రాజెక్టులు అయినా నిర్వహణ సక్రమంగా ఉండాలి. తూర్పుగోదావరి జిల్లాలో చిన్నచిన్ని ప్రాజెక్టుల నిర్వహణకు రూ.10కోట్లు, రూ.20కోట్లు ఇవ్వడానికి ఈప్రభుత్వం వద్ద డబ్బులేదు. అదే చిత్తూరుజిల్లాలో అవసరం లేకపోయినా అక్కడిమంత్రికి రూ.8వేలకోట్ల టెండర్లు కట్టబెట్టారు. రైతుల్ని బెదిరించి వాళ్లకు పరిహారం ఇవ్వకుండా వాళ్లభూముల్లో పైపులు వేశారు.

అవులపల్లి రిజర్వాయర్ పేరుతో ఇష్టమొచ్చినట్టు నిర్మాణంచేస్తే, దానిపై ఎన్జీటీ రూ.100కోట్ల జరిమానా వేసింది.  దానిపై మేం ప్రశ్నిస్తే, దాడుల కు తెగబడ్డారు. 172 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమకేసులు పెట్టారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే అరాచకాలు చేస్తారా? మీరు ఎంతతెగిస్తే, మేంఅంత రెట్టించి పోరాడ తామని తెలుసుకోండి.  ఈ ప్రాజెక్టులతో పాటు పోలవరం పూర్తిచేసి, చిన్నచిన్న లిఫ్టులు ఏర్పాటుచేస్తే తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి నీళ్లు అందించవచ్చు. అంతా బాగుంటే భవిష్యత్ లో హైడ్రోజన్ కూడా ఈ జిల్లాలో ఉత్పత్తిచేయవచ్చు.

దానివల్ల విద్యుత్ ఉత్పత్తి పెంచి, ప్రజలకు చౌకధరకే కరెంట్ అందించవచ్చు. 2014-19లో మేం విద్యుత్ ఛార్జీలే పెంచలేదు.. ఈ ముఖ్యమంత్రి వచ్చాక నాలు గేళ్లలో 8సార్లు పెంచాడు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి, నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకు అందించింది తెలుగుదేశం ప్రభుత్వమే. నూతన విద్యుత్ పాలసీ అమలుచేస్తే, భవిష్యత్ లో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలే లేకుండా చేయవచ్చు. దాని గురించే ఆలోచిస్తున్నాం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుం ది అంటే, ఎన్నిసార్లు ఎన్ని తేదీలు మార్చారో… ఇలాంటి నాయకత్వం ఉండటం నిజంగా మన దురదృష్టం..మనఖర్మ.

పోలీసుల్ని నేరాల్లో భాగస్తుల్ని చేస్తున్నారు

నేను వస్తుంటే దారిలో కనిపించే టీడీపీ నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల్ని వీళ్లు చేసేనేరాలు, తప్పుల్లో భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమ తరహా నేరపూరిత స్వభావమే. నేరాలు ఘోరాలు వాళ్లు చేస్తూ, వాటిలో పోలీసుల్ని ఇన్ వాల్వ్ చేసి, వారిద్వారా బయటకు వచ్చే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అయినా లెక్కచేయం. నా ధృఢ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే నాలక్ష్యం.” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Related posts

రాఫెల్ యుద్ధ విమానాలు మిమ్మల్ని ఏమీ చేయలేవ్

Satyam NEWS

కొల్లాపూర్ రాజాగారి కోట నిర్మాణాలపై ప్రభుత్వం స్టేటస్ కో

Satyam NEWS

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment