టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచి పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అందుకే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీపై ఆదివారం ఎంపీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పండగ ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందుల నడుమ కొనసాగడం పట్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు పోతున్న ప్రయాణికులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నరని, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పంతంగి, పగిడిపల్లి, కొర్లపాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలవడం దారుణమన్నారు. దీనిపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్ లో మాట్లాడానని కోమటిరెడ్డి తెలిపారు.