26.7 C
Hyderabad
May 3, 2024 10: 29 AM
Slider శ్రీకాకుళం

కొవ్వాడ అణు పార్కు ఉత్తరాంధ్ర కు మరణ శాసనం

#srikakulam

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు పార్కు ఉత్తరాంధ్ర కు మరణ శాసనం అని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. శ్రీకాకుళంలో అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సిపిఐ నాయకులు డి శంకర్రావు, సిపిఐఎంఎల్(న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ కొవ్వాడ అణు పార్కు అమెరికాకు సిరి ఉత్తరాంధ్రకు ఉరి అని అన్నారు.

అమెరికా షరతులకు లోబడి కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొవ్వాడ అణుపార్క్ రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్క్ పెట్టడంపై వైసీపీ, టీడీపీ ఎందుకు మాట్లాడం లేదని వారు ప్రశ్నించారు. కొవ్వాడలో అణు పార్క్ పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమేనని వారు అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్ లో ఇక్కడ పార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని అన్నారు.

అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రమా?

ఈ ప్రాంతం అధిక జనసాంద్రత గల ప్రాంతమని ప్రకృతి వైపరీత్యాల వలన గాని, మానవ తప్పిదం వలన గాని, యంత్రం లోపం వలన గానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా అటు కాకినాడ నుండి ఇటు ఒరిస్సా ఛత్రపూర్ వరకూ సమస్త జీవకోటి సర్వనాశనం అవుతుందని అన్నారు. భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని అన్నారు.

లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, అణుపార్క్ వలన విడుదల అయ్యే రేడియో ధార్మికత వలన భూమి, నీరు, గాలి, ఆహార పదార్థాలు విషతుల్యం అవు తాయని అన్నారు. ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాపిస్తే ఆ ప్రాంతమంతా ఆహారపదార్థాలు విషతుల్యమౌతాయని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములను నాశనంచేసి, అధిక జనసాద్రత గల ప్రాంతంలో అణుపార్క్ పెట్టడానికి పాలకులు పూనుకున్నారని విమర్శించారు.

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గల దేశాలు అణువిద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నారని గుర్తు చేశారు. 1979లో అమెరికా త్రీమైల్ ఐలాండ్లో అణుప్రమాదం జరిగిన తరువాత కొత్తగా అణువిద్యుత్ కేంద్రాలు పెట్టలేదని అన్నారు.

1986లో చెర్నోబిల్ అణుప్రమాదం జరిగిన తర్వాత అక్కడ మానవాళికి నివసించడానికి వీలులేకుండాపోయిందని అన్నారు. కాలిఫోర్నియాలో ఉన్న అణువిద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని అమెరికా చట్టం చేసిందని అన్నారు. అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి సుమారు 60 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలో పని నిలుపుదల చేసారని అన్నారు.

ప్రపంచంలో అత్యంత ఎక్కువ యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణువిద్యుత్తు కేంద్రం కూడా లేదని అన్నారు. దివాలా తీసిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో కలిసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఒకే చోట ఆరు అణు రియాక్టర్లు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదమని అన్నారు.

జపాన్లో పుకిషిమా దుర్ఘటన తరువాత ఆ దేశ బడ్జెట్ లో సగం అణుధార్మికతను అదుపు చేయడానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ఖరీదైన  అణువిద్యుత్తు కేంద్రం మనకు అవసరం లేదని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు.

ఈ ధర్నాలొ సిపిఎం నాయకులు పి తేజేశ్వర రావు‌, టి తిరుపతిరావు, కె నాగమణి,కొత్తకొట అప్పారావు, ఎన్ వి రమణ, డి రమణారావు, ఎ సత్యం, వి పాణి గ్రహీ. శ్రీదేవి పాణి గ్రహి, సిపిఐ నుండి కె బాస్కర రావు, చిక్కాల గొవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షునిగా చిట్టి వెంకటరావు

Satyam NEWS

సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు

Satyam NEWS

మహిళలను విద్యావంతులు చేసిన సావిత్రిబాయి పూలే

Satyam NEWS

Leave a Comment