38.2 C
Hyderabad
April 29, 2024 19: 46 PM
Slider వరంగల్

అక్రమ రియల్ దందాకు సహాకరిస్తున్న అధికారులపై చర్యలు

#kusuma

జిల్లా కేంద్రంలోని సమీప ప్రాంతాల్లో అక్రమ రియల్ దందాను అరికట్టాలని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు ఆయన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్ తో సమావేశమయ్యారు. గత కొంత కాలంగా ములుగు జిల్లా కేంద్రంలో వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్దంగా వెంచర్లు ఏర్పటుచేస్తూ సొమ్ము చేసుకుంటున్న రియల్టర్లపై సంబంధిత అధికారులు చర్యలు  తీసుకోవాలని అన్నారు.

జిల్లా కేంద్రంలో డిటిసిసి లేఅవుట్ అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన వెంచర్లను తొలగించి వాటికి సహాకరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని అన్నారు. అమాయక ప్రజలను  ఆసరగా చేసుకుని ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లను కట్టబెడుతూ రియల్ ఎస్ర్టేట్ వ్యాపారులు దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అయినా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

నిబంధనలను అతిక్రమిస్తే ఎంత వారిపైనైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మంగపేట మండల రెవెన్యూ సమస్యల గురించి కూడా చర్చించారు.  మంగపేట మండల ప్రజల భూముల యొక్క సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ, పిఎసిఎస్ మంగపేట వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, రాజు యాదవ్, ఊడుగుల శ్రీనివాస్, చిట్టమల్ల సమ్మయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రికాషన్: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు

Satyam NEWS

క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

సాంకేతిక సమస్యల పేరుతో నిత్యకృత్యంగా మారిన విద్యుత్ కోతలు

Bhavani

Leave a Comment