40.2 C
Hyderabad
May 6, 2024 16: 00 PM
Slider గుంటూరు

టీఎన్ఎస్ఎఫ్ నేతల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం

#Dr.Chadalawada

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబరు 77 ను  రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం (T.N.S.F)  జనవరి 22 (శుక్రవారం నాడు)న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు ఇచ్చారు.

అయితే గురువారం అర్ధరాత్రి నుండి టీఎన్ఎస్ఎఫ్ కు చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా అక్రమంగా నిర్బంధించారు.

కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మాత్రమే జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్య వసతి పథకాలు వర్తిస్తాయని, మిగిలిన వారికి ఈ రెండు పథకాలు వర్తించవని జీవో నెంబర్ 77 ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.

సదరు జీవో అమలు జరిగితే వేల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, కన్వీనర్ కోటాలో సీట్లు  పొందలేని పేద విద్యార్థులు అందరూ విద్యా దీవెనకు, విద్యా వసతి పథకాలు కోల్పోతారు.

తక్షణమే జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేద్దామన్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు తీవ్రంగా ఖండించారు.

అరెస్ట్ అయిన విద్యార్థులను టిడిపి నాయకులు పులిమి రామిరెడ్డి,కొల్లి బ్రహ్మయ్య,చల్ల సుబ్బారావు పరామర్శించడం జరిగింది. అరెస్టయిన వారిలో పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, యాసలా శ్రీను, పృథ్వి తదితరులు ఉన్నారు.

Related posts

బోనాల పండుగ

Satyam NEWS

వీది కుక్కల దాడిలో 31 గొర్రెలు మృతి

Satyam NEWS

కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ

Satyam NEWS

Leave a Comment