32.2 C
Hyderabad
May 2, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

వనపర్తిలో బిజెపి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

#BJPWanaparthy

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం హిందూ ధార్మిక  సంస్థలతో కలిసి బిజెపి నిర్వహిస్తున్న జన జాగరణ ను ఉద్దేశించి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  రాముని పేరు చెప్పి బిజెపి నాయకులు ఇల్లిల్లూ తిరుగుతూ బిచ్చగాళ్ళలా బిచ్చమెత్తుకుంటున్నారని మాట్లాడినందుకు వనపర్తిలో బిజెపి నాయకులు నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎవరు కూడా  విరాళాలు ఇవ్వద్దని, ఉత్తరప్రదేశ్లో రామాలయానికి తెలంగాణలో విరాళాలు ఇవ్వటం ఎందుకని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అధికార టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు

ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని రాజీవ్ చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, బి. కృష్ణ  మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల పట్ల 24 గంటలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదని ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే వ్యక్తిగతమా లేక టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తెలియజేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉందన్నారు. 

ముఖ్యమంత్రి  స్పందించని పక్షంలో స్వయంగా ముఖ్యమంత్రి  తెర వెనక ఉండి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  చేత ఈ ప్రకటన ఇచ్చినట్లుగా తెలంగాణ సమాజం భావించవలసి ఉంటుందని చెప్పారు.కేవలం మైనార్టీ వర్గాల కోసం హిందువుల మనోభావాలు దెబ్బ తీయడం, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

గతంలో కరీంనగర్ గడ్డ సాక్షిగా హిందూ గాళ్లు బొందు గాళ్లు అని హిందూవులను అవమానపరచిన కేసీఆర్ కు తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో  గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు.తక్షణమే సదరు ఎమ్మెల్యే హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో  హిందూ ధార్మిక సంస్థలు, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ ఉపాధ్యక్షులు సుమిత్రమ్మా, బండారు కుమారస్వామి, రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, ఏ.సీతారాములు,  మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీశైలం, సీనియర్ నాయకులు చిత్తారి ప్రభాకర్,బచ్చు రాము, రంగం శ్రీను జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సూగురు రాము,  మండల అధ్యక్షులు, సర్పంచ్ దేవేందర్,  పట్టణ ఉపాధ్యక్షులు విక్రమ్, మాజీ ప్రధాన కార్యదర్శి డి. ప్రవీణ్  వంశీ  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కల్లుగీతకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

Satyam NEWS

హై అలెర్ట్ :హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉద్రిక్తత

Satyam NEWS

పన్నులతో పట్టణ, నగర ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment