28.7 C
Hyderabad
April 27, 2024 04: 15 AM
Slider వరంగల్

కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ

#Leprocy Programme

క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వివరాలను నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కోరారు.

ములుగులో నేడు టిబి నియంత్రణ, లెప్రసి ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పోరిక రవీందర్ అధ్యక్షతన కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా కుష్టి వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలని, కుష్టు  వ్యాధిగ్రస్తుల ఆరోగ్య స్థితిగతులను కనుక్కొని వారికి కావలసిన చికిత్స అందించాలని అన్నారు.

చర్మంపై తెల్లని ఎర్రని రాగి రంగు గల మచ్చలు, ఆ మచ్చలు పై స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండటం స్పర్శ లేని మచ్చలు గుర్తించడం ముఖ్య విషయమని ఆయన అన్నారు.

ముఖం పైన నూనె పోసినట్లు మెరుస్తూ ఉండటం, చెవులు తమ్మెలు లావెక్కడం, దద్దుర్లు రావడం అరికాళ్ళలో అరచేతుల్లో తిమ్మిర్లు రావడం కుష్టు వ్యాధి లక్షణాలని ఆయన తెలిపారు.

పట్టు సడలించడం కనురెప్పలు సరిగా మూసుకు పోవడం, సరిగా పైకి లేవలేక పోవడం కూడా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ శిక్షణాకార్యక్రమంలో డాక్టర్ మధు, డిపిఎంఓ డాక్టర్ వినయ్ భాస్కర్, సాంబయ్య, సంజీవరావు, నవీన్ రాజ్ కుమార్, సిహెచ్ దుర్గారావు సదానందం, హెచ్ వో రాజు హెల్త్ ఎడ్యుకేటర్ లు ప్రతాప్,

తిరుపతయ్య కోడిశాల, పస్రా, తాడ్వాయి, గోవిందరావుపేట్, రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి: ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

Satyam NEWS

కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ మంత్రివర్గం

Satyam NEWS

ఎస్కేప్డ్:జైలు నుంచి తప్పించుకున్న తాలిబన్ ఉగ్రవాది

Satyam NEWS

Leave a Comment