38.2 C
Hyderabad
May 2, 2024 21: 50 PM
Slider నల్గొండ

విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని శోధించి సాధించాలి

#hujurnagarpolice

విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని శోధించి సాధించాలని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామలింగారెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో బుధవారం జరిగిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామలింగారెడ్డి,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యను బట్టీ పట్టే విధానంలో కాకుండా సమగ్ర సంగ్రహణ మూల్యాంకన పద్ధతులలో అభ్యసించాలని సూచించారు.

విద్యార్థులకు విద్యతోపాటు వివిధ రంగాలలో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు ఆన్లైన్ తరగతుల బోధనను వినే సమయంలో వచ్చే వివిధ రకాల సంక్షిప్త సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అన్నారు.

విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి పాఠశాలలో నిర్వహించిన విషయ బోధనా పరికరాల ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డి జి ఎం సుధాకర్,ఆర్ ఐ సుజిత,ప్రిన్సిపల్ పోసాని వెంకట రమణారావు,డీన్ నాగ సైదులు,శ్రీనివాసరెడ్డి,కృష్ణ కుమారి, సంధ్య,ఏవో మద్దూరి వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

భావి భారత పౌరులకు అంబేద్కర్ ఆదర్శం

Sub Editor

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోంది

Satyam NEWS

Leave a Comment