30.7 C
Hyderabad
April 29, 2024 04: 14 AM
Slider నిజామాబాద్

మద్యం అమ్మకాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

#POW Nizamabad

లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసి మంచి బాట పట్టిన వారిని మళ్లీ మత్తులోకి లాగిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యం అమ్మకాలను విరమించుకోవాలని ప్రగతిశీల మహిళ సంఘం(POW),ప్రగతిశీల విద్యార్థి సంఘం(PDSU) డిమాండ్ చేశాయి. నిజామాబాద్ జిల్లా బాల్కోండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వారు ప్లకార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం కమ్మర్ పల్లి తాహసిల్దార్ బావయ్యకి PDSU-PYL నాయకులతో కూడిన బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో సత్తెమ్మ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కొంత మంది మద్యానికి దూరమయ్యారని, వారికి మళ్లీ మద్యం గుర్తు చేశారని ఆమె అన్నారు. వందల సంఖ్యలో  మద్యం  షాపుల దగ్గర జనం గుమిగూడితే కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు. అందుకే తక్షణమే మద్యం షాపులలో మద్యం అమ్మకాలు నిలిపివేయలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSUనాయకులు అన్వేష్ స్వామి శివాణి POW నాయకులు కవిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

నంద్యాల జిల్లాలో 24 మందిపై పీడీయాక్ట్

Satyam NEWS

లంచం తీసుకునే దరిద్రులారా ఈ తాళిబొట్టు తీసుకుని పని చేయండి

Satyam NEWS

నరసరావుపేట లో పర్యటించిన సినీ నటుడు శివాజీ

Satyam NEWS

Leave a Comment