31.7 C
Hyderabad
May 2, 2024 10: 43 AM
Slider కడప

వైసీపీ సానుభూతి పరుల లబ్ది కోసమే ఆన్ లైన్ విధానం….

#rajampet

కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్ వినతిపత్రాన్ని అందించారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల లో ప్రవేశపెట్టిన ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్ లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని వినతి పత్రంలో కోరారు.కలెక్టర్ వి.విజయ రామ రాజు వారు ఇచ్చిన వినతి పత్రాన్ని సంతకం చేసి సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు అందజేశారు. వినతి పత్రం అందించిన వారిలో జిల్లా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ వైసీపీ సానుభూతి పరుల కాలేజీల లబ్ది కోసం ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారని విమర్శించారు.

ఇతర జిల్లాలలోని కాలేజీల్లో చేరే విద్యార్థులు 15 శాతం ప్రవేశం మాత్రమే కల్పించడం దుర్మార్గపు చర్య అన్నారు. వెంటనే వీటిని రద్దు చేయక పోతే అన్నీ విద్యార్థి సంఘాల తో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Related posts

కర్షకులకు బాసటగా నిలుద్దాం: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

Satyam NEWS

ఎస్పీ దీపికా సమక్షంలో గోడు చెప్పుకున్న బాధితులు..!

Satyam NEWS

చూడముచ్చటగా ఉన్న దుర్గం చెర్వు కేబుల్ వంతెన

Satyam NEWS

Leave a Comment