23.7 C
Hyderabad
May 8, 2024 04: 25 AM
Slider మహబూబ్ నగర్

నవోదయ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

#students

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న నవోదయ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ విద్యార్థి సంఘం నాయకులు డి. శేఖర్ కొల్లాపూర్ RDOకి వినతి పత్రం సమర్పించారు. గత విద్యా సంవత్సరం ఉమ్మడి జిల్లాలోని వట్టెంలో గల ఏకైక నవోదయ విద్యాలయంలో  6వ తరగతి ప్రవేశం కొరకు పరీక్షలను కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించారు.

అప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వచ్చి తమకు కావాల్సిన రూమ్ లో డ్యూటీలు వేయించుకున్నారు. ఇన్విజిలెటర్ గా డ్యూటీలు వేయించుకున్న ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులకు జవాబులు చెప్పి వారిని పాస్ చేయించారు.

ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే నవోదయ పరీక్షలు ఈ నెల 30 వ తేదీన నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో మళ్లీ కొంతమంది ఉపాధ్యాయులు ఇన్విజిలెటర్ గా వేయించుకొని (విద్యార్థుల తల్లిదండ్రులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని) గతంలో లాగా  నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారని అందువల్ల అలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని శేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శివ, విజయ్, ఆనంద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వండి.. అడిషనల్ ఎస్పీకి వినతి

Satyam NEWS

‘బండి’ భయంతో రెడ్డి ఓట్లకు గండి పెట్టుకున్న కేసీఆర్

Satyam NEWS

పైడితల్లి అమ్మ వారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

Satyam NEWS

Leave a Comment