32.7 C
Hyderabad
April 26, 2024 23: 45 PM
Slider శ్రీకాకుళం

వైసిపి ప్రభుత్వ హయంలో బాదుడే బాదుడు: ఎంపీ కింజరాపు

#kinjarapu

వైసిపి ప్రభుత్వ పాలన ప్రజా సంక్షేమ పాలన కాదని  ప్రజా వంచక పాలన అని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యలు కింజరాపు రామ్మోహన్నాయుడు,  శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,  మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక బాదుడు కార్యక్రమాలకు నిరసన గా   తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బాదుడే బాదుడు ” కార్యక్రమం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో 42 వ డివిజన్  ( కొత్త 29 వ డివిజన్) లో   డివిజన్ ఇంచార్జి  గుమ్మా రఘురామ్,  నగర తెలుగుయువత అధ్యక్షులు వాళ్ళ కిరణ్  ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.

వైసీపీ  ప్రభుత్వం కరెంట్ చార్జీలు భారీగా పెంచినందుకు నిరసన గా డివిజన్ లో ప్రజలు కు కొవ్వొత్తులు,  విసనకర్రలు,  అగ్గిపెట్టె లు,  ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న పన్నులు,  ఇతర బాదుడు కార్యక్రమాల వివరాలు తో ఉన్న కరపత్రా లను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎన్ని విధులు గా బాధలు పెట్టాలో  అన్ని రకాలుగా హింసిస్తూ పాలన సాగిస్తోతోందని ఇంత ఘోరం అయిన పాలన ఇంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదని అన్నారు.

కరెంట్ చార్జీలు,  బస్ చార్జీలు,  నిత్యవసరవస్తువుల ధరలు విపరీతంగా పెంచి రాష్ట్ర ప్రజలు ను అన్ని విధాలుగా హింసిస్తోందని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  అన్ని ధరలు ప్రజలు కు అందుబాటులో ఉంచేవారని ముఖ్యం గా విద్యుత్ చార్జీలు పెంచలేదని,  24 గంటలు కరెంట్ అందించేవారని అన్నారు.

జగన్ అధికారంలోకి రాగానే ఆస్తి పన్ను భారీగా పెంచారని,  ఆఖరుకు చెత్త పై పన్ను వేసి ప్రజలు ను ఎన్ని విధాలుగా ఏడిపించాలో అంతగా ఏడిపిస్తున్నారని కరెంట్ స్విచ్ వేయలంటేనే  బిల్లులు బాధేస్తున్నారనే భయం తో ప్రజల విసనకర్రలు, కొవ్వొత్తులు వినియోగిస్తున్నారని అన్నారు.

అందుకే తెలుగుదేశం పార్టీ తరుపున తాము వారికి అవి అందిస్తున్నామని  రాబోయే రోజుల్లో ప్రజలు ఈ YCP కి  వీటిన్నటికి తగిన విధంగా గుణపాఠం చెపుతారని వారు తెలిపారు. అనంతరం  వైసీపీ ప్రభుత్వం బాదుడు  కార్యక్రమాలుకు నిరసనగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు  డప్పులు బాధి ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కొర్ను నాగార్జున ప్రతాప్,  శ్రీకాకుళం పార్లమెంట్ ఉపాధ్యక్షులు  పీఎంజే బాబు, అధికారప్రతినిధి  ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు,  జిల్లా తెలుగుయువత అధ్యక్షులు మెండ దాసునాయుడు,  జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు మెట్ట సుజాత,లిడ్క్యాప్  మాజీ డైరెక్టర్  రమణ మాదిగ,    రాష్ట్ర యువత కార్యదర్శి  దుంగ భాస్కర్, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు కైబాడి రాజు,  ప్రధాన కార్యదర్శి  రోణంకి కళ్యాణ్,  డివిజన్ ఇంచార్జి లు  సురకాశి వెంకటరావు, సీపాన రమేష్,    కవ్వాడి సుశీల,  సీపాన రమా,  జాక శ్యాంసుందర్,  తాళ్లూరి నవీన్, నాయకులు పాలిశెట్టి మల్లిబాబు,  పేరూరి నాగేశ్వరరావు,  కాళీ శర్మ,  నగర తెలుగుయువత  ఉపాధ్యక్షులు  మూగి దనరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి  కంద్యాన బాల మురళీ,   కార్యదర్శి లు  జలగడుగుల  జగన్,  మణికంఠ, సయ్యద్ డివిజన్ ప్రజల  యువత పాల్గొన్నారు.

Related posts

ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు

Satyam NEWS

మిస్ యూ ఫ్యాన్ :టీమ్ ఇండియా వీరాభిమాని మృతి

Satyam NEWS

Leave a Comment