31.7 C
Hyderabad
May 2, 2024 11: 00 AM
Slider హైదరాబాద్

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి స్టడీ మెటీరియల్

#amberpet

గ్రూప్-1 మెయిన్స్ మరియు గ్రూప్-2, 3, 4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తూ యువతకు బంగారు బాట వేస్తున్నారని, గత మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయగా, 9 నెలల్లోనే 60,929 ఉద్యోగాలకు అనుమతినిచ్చారు. దేశ చరిత్రలోనే అనతికాలంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే కొనియాడారు.

మంచి ఉద్యోగాలు పొందిన యువత కృషితో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికి తమ ఆశీస్సులు ఉంటాయని, అందరూ బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు జంపాల రాజేష్, జీనియస్ పబ్లికేషన్ డైరెక్టర్ రఘు, దీపిక, నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఉపాధి హామీ కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు

Satyam NEWS

ముగిసిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమం

Satyam NEWS

మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన

Satyam NEWS

Leave a Comment