37.2 C
Hyderabad
April 26, 2024 22: 29 PM
Slider నల్గొండ

ఉపాధి హామీ కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు

#srinivasapuram

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో విస్తృత కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు తెలిపారు.

మొత్తం 50 మంది గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం,చేతులను ఎప్పటి కప్పుడు శానిటైజర్ తో కాని,సబ్బుతో కాని శుభ్రంగా కడుక్కోవడం చేయాలని సూచించారు.

గ్రామాల్లోని  కరోనా రోగులు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ ను ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ,అలివేలు మంగ, గ్రామ కార్యదర్శి ఇందిరా, కమలమ్మ, సునిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబుకు విశాఖ పర్యటనకు అనుమతి

Satyam NEWS

కుర్చీ రాజకీయాలు తప్ప కాంట్రాక్ట్ కార్మికుల్ని పట్టించుకోరా?

Satyam NEWS

డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ప్రయత్నం

Satyam NEWS

Leave a Comment