29.7 C
Hyderabad
May 6, 2024 04: 48 AM
Slider ముఖ్యంశాలు

స్టుపిడిటీ: కరోనా మృతుడు కలిసిన 100 మంది ఎవరు?

carona virus

కరోనా వైరస్ సోకడంతో నిన్న మరణించిన కల్బుర్గి వాసి హైదరాబాద్ లో సుమారు 100 మందిని కలిశాడని అధికారుల విచారణలో తేలింది. చికిత్స కోసం కేర్ ఆసుపత్రికి వచ్చిన ఆ కరోనా వైరస్ రోగి అక్కడ 17 మందిని కలిసినట్లు అధికారులు గుర్తించారు.

కేర్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో అతను కేవలం 3 గంటల పాటే ఉన్నా 17 మందిని అతను కలిశాడు. అదే విధంగా కేర్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరడానికి ముందు అతను మూడు ఆసుపత్రులకు కూడా వెళ్లాడు. అక్కడ సుమారు 100 మందిని అతను కాంటాక్టు అయ్యాడు. ముందుగా అతను కల్బుర్గిలోని జిమ్స్ (గుల్బర్గా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్) ఆసుపత్రికి వెళ్లాడు.

అక్కడ అతనికి సోకింది కరోనా అని గుర్తించారు. ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు వారు అనుమతించలేదు. అయితే తనకు అక్కడ చికిత్స సక్రమంగా జరగడంలేదని గొడవ చేసిన అతను ఆసుపత్రి నుంచి డామా (డిశ్చార్జి ఎగెనెస్ట్ మెడికల్ ఎడ్వయిజ్ ) తీసుకుని బయటకు వచ్చేశాడు.

హైదరాబాద్ లో కేర్ ఆసుపత్రి కి రాగానే వెంటనే అతడికి సోకింది కరోనా వైరస్ అని గుర్తించి ఐసోలేషన్ వార్డులో ఉంచి గాంధీ ఆసుపత్రికి కబురు పంపారు. అయితే అతను గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించి మళ్లీ కేర్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసి మూడు ఆసుపత్రులకు తిరిగాడు. అక్కడా అతడిని చేర్చుకోకపోవడంతో తిరిగి కల్బుర్గికి వెళుతుండగా మార్గమధ్య లో అతను చనిపోయాడు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి వారు లామా( లెఫ్ట్ ఎగెనెస్టు మెడికల్ ఎడ్వయిజర్) బుక్ చేశారు. ఈ వ్యక్తి దుబాయ్ నుంచి కల్బుర్గికి వెళ్లి అక్కడ ఆసుపత్రిలో చేరాడు.

Related posts

కోడికత్తి కేసులో అన్నీ అసత్యాలే చెప్పారు: ఎన్ఐఏ

Bhavani

ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

మూడు రాజధానుల రచ్చపై గంగుల ప్రతాప్ రెడ్డి ఫైర్

Satyam NEWS

Leave a Comment