33.7 C
Hyderabad
April 29, 2024 00: 53 AM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మపై టాలివుడ్ బహిష్కరణ వేటు?

#Ramgopal Varma

పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా కించపరుస్తూ, ఆయన రాజకీయ జీవితాన్ని అవహేళన చేస్తూ పవర్ స్టార్ అనే సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ను బహిష్కరించాలని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలిసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై బురద చల్లే విధంగా రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం రెండు రోజుల్లో విడుదల కానున్నది.

 పవన్ కల్యాణ్ ను క్యారెక్టర్ ను అత్యంత కనిష్ట స్థాయిలో చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి వ్యవహారాలను తెరకెక్కిస్తున్నారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును ఆయన వాల్ పోస్టర్లపైనా, ట్రైలర్ లలోనూ ప్రముఖంగా చూపించారు.

ఇవన్నీ తీవ్ర అభ్యంతరకరమైనవే. గురువారం రాత్రి జనసేనకు చెందిన కొందరు యువకులు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్దకు వెళ్లగా ఆయన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చి వారిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో వారిని విడిచిపెట్టారు.

ప్రముఖులపై సినిమాలు తీయడం వాటి ద్వారా వచ్చే సంచలనాన్ని సొమ్ము చేసుకోవడం రామ్ గోపాల్ వర్మకు అలవాటైపోయింది. సెక్సు, వైయలెన్సు చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల వాటిని విడుదల చేసి భారీ లాభాలను ఆర్జించారు. మిర్యాలగూడాలో ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా మరో చిత్రాన్ని ఆయన ప్లాన్ చేసుకున్నారు.

ఇప్పటికే పోస్టర్లు కూడా విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మపై సంబంధిత వ్యక్తులు ఎస్ సి  కేసులు నమోదు చేశారు. వివాదాలే పెట్టుబడిగా తెలుగు చిత్ర పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ ను టాలివుడ్ నుంచి బహిష్కరించాలని ప్రదిపాదిస్తున్నారు. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మపై ఇలాంటి బహిష్కరణ వేటునే వేశారు.  

Related posts

వడ్డీ వ్యాపారం ముసుగులో సామాన్యులను వేధిస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS

భజరంగ్ దళ్ కార్యకర్తలపై దౌర్జాన్యాన్ని ఖండించిన విహెచ్ పి

Satyam NEWS

బొడ్డు అశోక్ నిర్మిస్తున్న`క్రేజీ అంకుల్స్‌` ట్రైల‌ర్ రిలీజ్

Sub Editor

Leave a Comment