29.7 C
Hyderabad
May 3, 2024 03: 40 AM
Slider పశ్చిమగోదావరి

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

#public money

పంచాయితీ రాజ్ శాఖ లోని పిఆర్ఐ, పిఐయు శాఖల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ప్రజలకు శాపంగా మారింది. ఏలూరు జిల్లా లో పిఆర్ఐ, పిఐయు శాఖల మధ్య ఏడాది కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. పి ఆర్ ఐ శాఖ 2022 జనవరిలో జిల్లా విభజన తరువాత భీమవరం తరలి పోయింది. అయినా నేటికి కూడా పి ఆర్ ఐ శాఖ ఏలూరు కార్యాలయాన్ని కాళీ చేయని పరిస్థితి పి ఐ యు శాఖ కి మింగుడు పడని పరిస్థితిగా మారింది. భీమవరం తరలిపోయిన పి ఆ ర్ ఐ సిబ్బంది ఏలూరు ఆఫీసు కాళీ చేయలేదని ఛార్జ్ కూడా అప్పగించలేదని పి ఐ యు శాఖ సిబ్బంది వాపోతున్నారు.

ఏడాది కాలంగా ఏలూరు జిల్లా కు కొత్తగా విధులు చేపట్టిన పి ఆర్ ఐ సిబ్బందికి ఈ వ్యవహారం తల నొప్పిగా మారింది. అప్పటి నుండి ఆ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు మారిన జిల్లా కు వెళ్లకుండా ఏలూరు జిల్లా కార్యాలయం లోనే కదలకుండా ఉండిపోయారు. ఈ ఉద్యోగులు ఏలూరు జిల్లాలో విధులు నిర్వహించడానికి అవకాశమే లేకపోయినా ఏలూరులోని ఖాళీగా ఉంటున్న పరిస్థితిపై పి ఐ యు శాఖ తర్జన భర్జన పడుతుంది. భీమవరం వెళ్ళరు…. ఏలూరు కార్యాలయాన్ని కాళీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ శాఖలో విధులు నిర్వహించే రెగ్యులర్ ఉద్యోగులకు ఏలూరులో కాళీగా కూర్చోబెట్టి నెలనెలా వేలకు వేలు వేతనాలు ప్రభుత్వం ఇస్తున్న తీరు పై పలు శాఖల ఉద్యోగులు పలు విమర్శలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఏలూరులో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ శాఖలు కలిసి ఉండేవి. జిల్లాల పునర్విభజన విభజన తరువాత పి ఆర్ ఐ శాఖను ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరంకు తరలించారు.

ఈ శాఖ ఏలూరు జిల్లా నుండి తరలి పోయి సుమారు ఏడాది కావస్తున్నా భీమవరం వెళ్లాల్సిన పి ఆర్ ఐ ఉద్యోగులు కొంత మంది ఏలూరు జిల్లా పి ఆర్ ఐ కార్యాలయాన్ని కాళీ చేయడం లేదు. ఏడాది కాలంగా ఏలూరు లో పనిపాటా లేకుండా వేతనాలు పొందుతూ కాలక్షేపం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా పి ఐ యు శాఖ కు పి ఆర్ ఐ శాఖను ప్రభుత్వం విలీనం చేయడం తో పి ఐ యు శాఖ పి ఆర్ ఐ శాఖ కు కొత్త సిబ్బందిని కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది.

అయితే పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం బదిలీ అయిన సిబ్బంది ఏలూరు జిల్లా పి ఆర్ ఐ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా, ఛార్జ్ అప్పగించకుండా ఏడాదిగా కాలయాపన చేస్తుండటంతో ఏలూరు జిల్లాకు కొత్తగా వచ్చిన సిబ్బంది కి కార్యాలయ వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఏలూరు జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాగా భీమవరం తరలిపోయిన పి ఆర్ ఐ శాఖలో విధులు నిర్వహించే కాంట్రాక్టు ఉద్యోగులకు సుమారు9 నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి పై పలువురు కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.

దీనిపై పి ఐ యు ఈ ఈ రమణ మూర్తి ని సత్యంన్యూస్ వివరణ కోరగా పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వం ఏలూరులో ఉన్న పి ఆర్ ఐ శాఖ ను భీమవరం తరలించిందన్నారు. అక్కడకు వెళ్లాల్సిన సిబ్బంది ఏలూరు జిల్లా కార్యాలయాన్ని ఖాళీ చేయటం లేదన్నారు. దీంతో పి ఆర్ ఐ శాఖ కు కొత్తగా వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు.

రిషి, జర్నలిస్టు, ఏలూరు

Related posts

20 రోజుల్లో లక్ష మందికి ఐఐటి జెఈఈ, నీట్ సమాచారం

Satyam NEWS

గుడ్ జాబ్: ఎగుమతుల్లో వృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన జగన్

Satyam NEWS

Leave a Comment