29.7 C
Hyderabad
May 2, 2024 06: 17 AM
Slider ముఖ్యంశాలు

గుడ్ జాబ్: ఎగుమతుల్లో వృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం

#Minister KTR

దేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 1 శాతం నుంచి 11.5 8 శాతానికి పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను నేడు ఆయన విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి  కేటీఆర్, జాతీయ జియస్ డిపి సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదయిందన్నారు. తలసరి (ఫర్ క్యాపిట) ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు 1,34,432 రూపాయలతో పోల్చినప్పుడు తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం 2,28,216 రూపాయలుగా నమోదైందని మంత్రి అన్నారు.

అద్భుత ఫలితాలు ఇచ్చిన టిఎస్ ఐపాస్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక ts-ipass విధానం అద్భుతమైన ఫలితాలను అందించిందని, ముఖ్యంగా ఈ ఓ డిబి ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి దాకా వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య 1,96,404 కోట్లరూపాయలుగా నమోదైందని అన్నారు. అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించాయని మంత్రి తెలిపారు.

రానున్న రోజుల్లో సుమారు 45, 848 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఇక భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్ సార్ ప్షన్(absorption) విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.

హైదరాబాద్ నగరం  జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా మరోసారి ప్రథమ ర్యాంకు సాధించినన్నారు. బెస్ట్ పర్ఫామింగ్ స్టేట్ గా నీతిఅయోగ్ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్నారు. సుమారు కరోనా రిలీఫ్ ఫండ్ కోసం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులను లేదా ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారన్నారు.

నివేదికలో ముఖ్యాంశాలు ఇవి:

ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకొని జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో  తన వాటాను 35 శాతంగా కొనసాగించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ పరిశ్రమకు smt కంపెనీ పునాది వేసింది. 250 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్ లో ఈ పరిశ్రమ రానున్నది.

దీని ద్వారా 1500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీ లో  170 కోట్ల రూపాయలతో తన పరిశ్రమను స్థాపించింది. 180,000 స్క్వేర్ ఫీట్ లతో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో యంయన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో ఫౌండేషన్ స్టోన్ వేశారు. హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది.

ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈసారి శాండజ్, సింజిన్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మెడికల్ డివైస్ పార్క్ లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి.

Related posts

భారత్ తో మంచి సంబంధాలు పెట్టుకోవడం లాభమే కానీ…

Satyam NEWS

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం

Murali Krishna

పంగడ పూట జనగామ జిల్లాలో ఒక వ్యక్తి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment